Reliance Jio Offer : ప్రముఖ టెలికాం దిగ్గజం జియో మరో సంచలన ప్రకటన చేసింది. గతంలో ఫ్రీగా ఢాటా, టాక్ టైమ్ ఇచ్చినట్లే ఇప్పుడు ఫ్రీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అందించేందుకు సిద్దమయ్యింది.
Reliace Jio : కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు అనేక రకాలుగా ప్రయత్నిస్తాయి. ఒక్కోసారి చాలా చవకైన రీచార్జ్ ప్లాన్స్ తో ముందుకొస్తాయి... పండగలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో స్పెషల్ ఆపర్స్ ప్రకటిస్తాయి... ఫ్రీగా సిమ్ కార్డ్, టాక్ టైమ్, ఇంటర్నెట్ డాటా ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటీవల కాలంలో టెలికాం కంపెనీలు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎయిర్ టెల్ వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రోను ఉచితంగా అందిస్తుండగా ఇదేబాటలో రిలయన్స్ జియో కూడా నడుస్తోంది.
25
జియో యూజర్లకు రూ.35,100 లాభం...
జియో ఇప్పటికే గూగుల్ జెమిని ప్రో సేవలను తమ వినియోగదారులకు అందిస్తోంది. అయితే మొదట కేవలం యువతకే ఈ అవకాశం కల్పించింది. అక్టోబర్ 30, 2025 నుండి 18 నుండి 25 ఏళ్లలోపు జియో కస్టమర్లకు రూ.35,100 విలువైన సేవలను ఉచితంగా అందిస్తోంది. అన్ లిమిటెడ్ 5G ప్లాన్ కలిగిన యువత ఈ జెమిని ప్రో సేవలను 18 నెలలపాటు అంటే ఏడాదిన్నరపాటు ఉచితంగా పొందవచ్చు.
35
ఇక జియో యూజర్లందరికీ గూగుల్ జెమిని ప్రో ఫ్రీ
తాజాగా గూగుల్ జెమిని ప్రోను మరింతమంది కస్టమర్లకు చేరువ చేసేందుకు సిద్దమయ్యింది రిలయన్స్ జియో. ఇవాళ్టి నుండి (నవంబర్ 19, బుధవారం) నుండి కేవలం యువతే కాదు తమ యూజర్లందరు జెమిని ప్రో ను ఉచితంగా వాడుకోవచ్చని జియో ప్రకటించింది.. రూ.35,1000 విలువన ఈ ఏఐ సేవలను ఉచితంగా పొందాలంటే అన్ లిమిటెడ్ 5G అవసరం... అంటే నెలనెలా రూ.349 తో రీచార్జ్ చేసుకున్నవారికే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
మై జియో యాప్ ద్వారా ఈ ఫ్రీ గూగుల్ జెమిని ప్రో ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ లిమిటెడ్ 5G కలిగిన వినియోగదారులు మైజియో యాప్ లోకి వెళ్లి 'క్లెయిమ్ నౌ' పై క్లిక్ చేస్తే చాలు ఈ సూపర్ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత వరుసగా 18 నెలలపాటు గూగుల్ ప్రోను ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం jio.com ను చూడండి.
55
ఎయిర్ టెల్ యూజర్స్ కి ఫ్రీ ఏఐ సేవలు
ఇదిలావుంటే ఇప్పటికే ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు రూ.17,000 విలువైన పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ చాట్ బాట్ సేవలను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఎయిర్ టెల్, పెర్ప్లెక్సిటీ మధ్య ఒప్పందం కుదుర్చుకుంది... ఏడాదిపాటు ఎలాంటి ఆటంకం లేకుండా పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను ఉచితంగా అందుకోనున్నారు ఎయిర్ టెల్ కస్టమర్లు.