అంతేకాకుండా ఈ ఫోన్ లో 256 జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. అలాగే డాల్బీ అట్మోస్ ఆడియో కూడా ఫోన్‌లో అందించారు. ఫోన్‌తో పాటు రియల్‌మీ టెక్‌లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది.
ఈ వాక్యూమ్ క్లీనర్ ఐరోబోట్ రూంబా 971, షియోమి ఎంఐ రోబోట్‌లతో పోటీగా తీసుకొచ్చారు. దీని లాంచ్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ, కంపెనీ నుండి రాబోయే ల్యాప్‌టాప్, టాబ్లెట్ టీజర్‌ను కూడా విడుదల చేసింది.
రియల్‌మీ జిటి 5జి ధరరియల్‌మీ జిటి 5జి ప్రారంభ ధర 449 యూరోలు అంటే సుమారు రూ.39,900. ఈ ధర వద్ద మీకు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 599 యూరోలు అంటే సుమారు రూ.53,200.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రియల్‌మీ జిటి 5జిని పోలాండ్, స్పెయిన్, రష్యా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో విక్రయించనున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి సమాచారం లేదు.
స్పెసిఫికేషన్లురియల్‌మీ జిటి 5జిలో అండ్రాయిడ్ 11 ఆధారంగా రియల్‌మీ యూఐ 2.0, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.43-అంగుళాల పూర్తి హెచ్‌డి అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ లభిస్తూంది, 12 జీబీ ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు.
రియల్‌మీ జిటి 5జి కెమెరాఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో లెన్స్, సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా దీని ఎపర్చరు ఎఫ్2.5.
రియల్‌మీ జిటి 5జి బ్యాటరీకనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ పై ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 65w ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 35 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.