ఫేస్ బుక్, ట్విట్టర్ తరువాత టి‌వి ఛానల్స్, డిజిటల్ ప్లాట్‌ఫాంలకు కొత్త ఐటి నిబంధనలు.. అదేంటంటే ?

First Published Jun 12, 2021, 1:19 PM IST

 గత నెలలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు భారత  ప్రభుత్వం కొత్త ఐటి నిబంధనలను అమలు చేసిన సంగతీ మీకు తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ప్రతి ఒక్క సంస్థ అమలు చేసినప్పటికీ, భారత ప్రభుత్వ కొత్త ఐటి పాలసీకి సంబంధించి సోషల్ మీడియా సంస్థలతో కూడా చాలా వివాదాలు ఏర్పడ్డాయి. 

ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన తరువాత నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) టీవీ ఛానెల్స్ అండ్ వార్తాపత్రికల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కొత్త నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించింది, కానీ దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ఇప్పుడు కొత్త ఐటి నియమాలు టీవీ ఛానెల్స్ ఇంకా వార్తాపత్రికల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా వర్తించనూన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లకు ఇప్పటికే అనేక రకాల నిబంధనలు ఉన్నాయని ఎన్‌బిఎ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది, వీటికి అదనంగా మరో కొత్త నిబంధనను వర్తింపచేయడం సరైనది కాదని తెలిపింది.
undefined
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందంటే ?ఎన్‌బి‌ఏ అభ్యర్థనను మంత్రిత్వ శాఖ తిరస్కరించిన తరువాత కొత్త నియమం ఎవరిపైనా అదనపు భారాన్ని పెంచబోదని, అలాగే కొత్త నియమం పరిధిలోకి తీసుకురావడంలో తప్పు లేదని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇలాంటి మినహాయింపును చట్టంలో చేర్చడం సరికాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కొత్త నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి అని సూచించింది.
undefined
డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కొత్త నియమం ప్రభావం ఎలా ఉంటుంది?కేంద్ర ప్రభుత్వ కొత్త ఐటి నియమం ప్రకారం, డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోపు ఫిర్యాదు చేసిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.
undefined
అంతేకాకుండా ఇందుకు నోడల్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను భారతదేశం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు అధికారులు 15 రోజుల్లోపు ఫిర్యాదులను పరిష్కరించాలి. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ప్రతి నెలా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, ఎన్ని పరిష్కరించబడ్డాయి అనే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.
undefined
click me!