రియల్‌మీ 8 5జి మీడియా ఇన్‌వాయిస్‌లో 'బి 5జి ఫ్యూచర్ రెడీ విత్ రియల్‌మీ' అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం భారతదేశంలో 5జి నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పటికీ అన్ని మొబైల్ కంపెనీలు 5జి ఫోన్‌లను ప్రతి నెలా ఇండియాలో విడుదల చేస్తున్నాయి. గొప్ప విషయం ఏమిటంటే రూ.20 వేల కన్నా తక్కువ ధరకే 5జి ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇటీవల కంపెనీ రియల్‌మీ నార్జో 30 ప్రోను విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే దేశంలో చౌకైన 5జి ఫోన్ ఇదే, దీని ధర రూ .16,999.
రియల్‌మీ 8 5జి స్పెసిఫికేషన్లు, ధరకంపెనీ రియల్‌మీ 8 ధర, ఫీచర్స్ గురించి అధికారికంగా వెల్లడించనప్పటికి లీక్ అయిన కొన్ని నివేదికల ప్రకారం రియల్‌మీ 8 5జి ధర రూ .21 వేలకు దగ్గరగా ఉంటుంది. ఫీచర్ల గురించి చూస్తే లాంచ్ చేయడానికి ముందు ఫోన్ కి సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. రియల్‌మీ 8 5జి మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జితో లాంచ్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అవుతున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదే కానుంది. ఈ ప్రాసెసర్‌ను మీడియాటెక్ లాంచ్ చేసింది.
అంతేకాకుండా 6.5-అంగుళాల డిస్ ప్లే దీనికి లభిస్తుంది, దీని రిఫ్రెష్ రేటు 90 హెర్ట్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ వి13 5జి రీ-బ్రాండెడ్ వెర్షన్ అవుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి.