ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజులకు మరింత పెరుగుతోంది. కొత్తకొత్త ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వస్తునే ఉన్నాయి... పాత మోడల్స్ కనుమరుగు అవుతూనే ఉన్నాయి. ఇండియా వంటి పెద్ద మార్కెట్ కలిగిన దేశంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్తకొత్త మోడల్స్ ను విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. ఇలా అమెరికన్ కంపెనీ యాపిల్ నుండి చైనా కంపెనీ ఎంఐ వరకు ఇండియాలో పోటీపడుతున్నాయి. ఇలా రియల్ మీ కూడా చాలాకాలంగా ఇండియాలో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సరికొత్త కాన్సెప్ట్ ఫోన్ ను పరిచయం చేసింది.
25
15000mah బ్యాటరీ ఫోనా..!
ఫోన్ లో ఎంతమంచి ఫీచర్లున్నా మెరుగైన బ్యాటరీ లేకుంటే ఎక్కువగా ఉపయోగించలేం. ఈ విషయాన్ని రియల్‌మీ గుర్తించినట్లుంది... అందుకే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండే ఫోన్లపై దృష్టిపెట్టింది. ఇలా రియల్‌మీ కొత్త కాన్సెప్ట్ ఫోన్‌లో 15,000mAh బ్యాటరీ ఉంటుందని ప్రకటించింది. ఇది ఇప్పటికే ఉన్న 10,000mAh కాన్సెప్ట్ ఫోన్ కంటే చాలా పెద్ద అప్‌గ్రేడ్. ఈ కొత్త ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ కెపాసిటీ కంటే రెండింతలు ఎక్కువ.
35
బిగ్ బ్యాటరీ ఫోన్ గురించి రియల్ మీ ఏమంటోంది...
రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ చేస్ తన సోషల్ మీడియాలో "15,000mAh" అని రాసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఓ కార్యక్రమంలో గ్రౌండ్ బ్రేకింగ్ కాన్సెప్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో ఒకటి 15,000mah బ్యాటరీతో వస్తుందని... దీన్ని నాన్ స్టాప్ గా 5 రోజులు వాడవచ్చని చేస్ పేర్కొన్నారు.
అయితే రియల్ మీ కూడా ఈ ఫోన్ గురించి కీలక ప్రకటన చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటలు వీడియోలు చూడొచ్చు.., ఐదు రోజుల వరకు వాడొచ్చని తెలిపింది. "ఇది బ్యాటరీ లైఫ్ కాదు, బ్యాటరీ స్వేచ్ఛ. ఒక్క ఛార్జ్‌తో 25 సినిమాలు, 30 గంటల గేమింగ్, లేదా మూడు నెలల స్టాండ్‌బై" అని రియల్ మీ కంపెనీ వెల్లడించింది.
ఈ భారీ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? అనేగా మీ అనుమానం. దీనికి 320W "Supersonic" ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు… కాబట్టి కేవలం రెండు నిమిషాల్లో 50% ఛార్జ్ చేయొచ్చు అని రియల్‌మీ చెబుతోంది. అంటే 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుందన్నమాట.
55
ఫోన్ బరువెంత?
ఫోన్ బరువు, మందం తక్కువగా ఉండటానికి సిలికాన్-కార్బన్ బ్యాటరీ వాడారు. రియల్‌మీ ఇటీవల 7,000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్‌తో P4 సిరీస్ ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు ఏకంగా 15000mah బ్యాటరీఫోన్ కాన్సెప్ట్ తో వచ్చింది... మరి ఈ కొత్త టెక్నాలజీ ఛార్జింగ్ సమస్యలను పూర్తిగా తొలగిస్తుందా అనేది చూడాలి.