ఐఫోన్ లవర్స్‌కి చేదువార్త, ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఎంతో తెలుసా?

Published : Aug 30, 2025, 10:49 AM IST

ఐఫోన్ లవర్స్ మనదేశంలో అధికంగానే ఉంటారు. టెక్నాలజీని ఇష్టపడే వారంతా ఐఫోన్ ను కొనుక్కుంటారు. త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు లాంచ్ అవ్వబోతున్నాయి. వాటి ధరలు ఎలా ఉంటాయంటే... 

PREV
15
ఐఫోన్ 17 సిరీస్

ఐఫోన్ 17 సిరీస్ అతి త్వరలో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ రాక కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 30,000 రూపాయల జీతం వచ్చే వ్యక్తి కూడా లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈఎమ్ఐలు ఇప్పుడు అందుబాటులో ఉండడంతో ఐఫోన్ ను ఎంతోమంది కొంటున్నారు. అందులో ఉన్న టెక్నాలజీ టెక్ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్ విడుదల కాబోతోంది. దీనికోసం ఎదురుచూస్తున్నవారికి ఇది కొంచెం చేదు వార్తే.

25
నాలుగు మోడల్స్ లో ఐఫోన్ 17 సిరీస్

ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9న లాంచ్ కాబోతున్నాయి. ఇవి నాలుగు మోడల్స్ లో రాబోతున్నట్టు ఆపిల్ ప్రకటించింది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఇలా నాలుగు మోడళ్లలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఐ ఫోన్ 16 సిరీస్ వరకు ఉన్న ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ 17 సిరీస్ ఐఫోన్లు మరింత అప్ గ్రేడ్లో ఉంటాయని సమాచారం. అందుకే వాటి ధరలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

35
అమెరికాలోని ధరలు

అమెరికాలో ఐఫోన్ 17, ఐ ఫోన్ 17 ప్రో మోడల్స్ ధరల గురించి కొంత సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం పాత మోడల్స్ తో పోలిస్తే ఐఫోన్ 17 సిరీస్ ధరలు 50 డాలర్ల మేరకు పెరిగినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మన దేశంలో వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ ధరలు ఎలా ఉండబోతున్నాయో ఒక అంచనాకు వచ్చారు టెక్ నిపుణులు. వారు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

45
ఐఫోన్ 17 ధరలు ఇవిగో

లీకైన సమాచారాన్ని బట్టి ఐఫోన్ 17 సిరీస్ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ మన దేశ కరెన్సీ ప్రకారం 84,990 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ 17 ప్రో ధర 1,24,900 రూపాయలు ఉంటే ఐఫోన్ 17 ప్రో మాక్స్ ద్వారా లక్షన్నర వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.

55
ఆ రోజే తెలుస్తుంది

అయితే ఆపిల్ సంస్థ నుంచి మాత్రం ఐఫోన్ 17 సిరీస్ కు సంబంధించి ఎలాంటి ధరల వివరాలు బయటికి రాలేదు. వారు అధికారికంగా సెప్టెంబర్ 9న ఫోన్లను లాంచ్ చేశాకే ధరలు ప్రకటించే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9 రాత్రి జరగనుంది. మీకు దీని ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలనిపిస్తే ఏ ఆపిల్.కామ్ లోకి వెళ్ళండి లేదా యాపిల్ టీవీ ద్వారా కూడా దీన్ని మీరు చూడవచ్చు. ఆ సమయంలోనే వీడు ధరలను కూడా ప్రకటిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories