ఫోన్ పే మరింత కొత్తగా.. ఇప్పుడు సెలెబ్రిటీ వాయిస్‌; దీన్ని ఎలా యాక్సెస్ చేయవచ్చో తెలుసుకోండి..

First Published | Sep 6, 2023, 1:19 PM IST

భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ కి సుదీర్ఘ చరిత్ర ఉంది, అయితే ఇవి  తాజా  సంవత్సరాలలో ముఖ్యంగా నోట్ల రద్దు  తర్వాత నిజంగా ప్రారంభమయ్యాయి. COVID-19 మహమ్మారి ఊపందుకుంటుండడంతో మరింత పెరిగింది. నేడు డిజిటల్ పేమెంట్లను  అంగీకరించే అనేక ప్రదేశాలలో  స్మార్ట్ స్పీకర్స్  ఉన్నాయి. 

ఈ స్పీకర్లు పేమెంట్ చేసిన తర్వాత వాలెట్‌లోకి డబ్బు  వచ్చినట్లు వాయిస్ వస్తుంది. అయితే ఇప్పుడు మీ పేమెంట్  సక్సెస్ అయ్యాక  పాపులర్ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ గొంతు వస్తే ఎలా ఉన్నటుందో  ఊహించుకోండి... 

 PhonePe మొట్టమొదటి సెలబ్రిటీ వాయిస్ ఫంక్షన్‌ను తీసుకొచ్చింది.  ఇప్పుడు ఈ ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మీరు PhonePe వాలెట్ ద్వారా పేమెంట్  చేసినప్పుడు, స్మార్ట్ స్పీకర్‌లో మీ పేమెంట్ సక్సెస్ అయినట్లు  అమితాబ్ బచ్చన్  వాయిస్ మీకు వినబడుతుంది.

ఈ ప్రముఖ సెలెబ్రిటీ గొంతును ఈ విధంగా ఉపయోగించడం ఇదే తొలిసారి. PhonePe మరిన్ని భాషల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది, అయితే ఇప్పుడు హిందీ ఇంకా ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉన్నందున దీనికి కొంత సమయం పట్టవచ్చు.
 

Latest Videos


ఈ కొత్త ఫీచర్ ఎలా స్టార్ట్ చేయవచ్చు అంటే:

*మొదట PhonePe బిజినెస్ యాప్ ని ఓపెన్ చేయండి 

*హోమ్ స్క్రీన్‌లో SmartSpeaker అప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

*"My SmartSpeaker" క్రింద "SmartSpeaker Voice"ని క్లిక్ చేయండి.

*మీకు నచ్చిన భాష కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్‌ని సెలెక్ట్ చేసుకోండి.

*వాయిస్‌ని ఆన్ చేయడానికి, "Confirm" క్లిక్ చేయండి.

*కొన్ని గంటల్లో, గాడ్జెట్ రీబూట్ అవుతుంది తరువాత అమితాబ్ బచ్చన్ వాయిస్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది.

PhonePe  స్మార్ట్ స్పీకర్ సేవను కేవలం ఒక సంవత్సరం క్రితం ప్రవేశపెట్టింది, ఇప్పటికే విజయవంతమైంది. భారతదేశంలోని 19,000 పోస్టల్ కోడ్‌లలో ప్రస్తుతం నాలుగు మిలియన్ల డివైజెస్ ని బిజినేస్ పార్టనర్స్ ఉపయోగిస్తున్నారని కంపెనీ నివేదించింది. ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్‌లను  సులభంగా క్యారీ చేయడం, రద్దీ ప్రదేశాలలో కూడా స్పష్టమైన ఆడియో ఇంకా  చిన్న డిజైన్ తో ప్రత్యేక ఫీచర్స్    ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ స్పీకర్ వివిధ భారతీయ భాషలలో వాయిస్ పేమెంట్ అలర్ట్స్  అందిస్తుంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 4 రోజుల వరకు ఉంటుంది. ఇంకా పేమెంట్  రీప్లే చేయడానికి ప్రత్యేక బటన్‌ ఉంటుంది.
 

click me!