భారత్ మండపం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Anubhava Mantapa బసవేశ్వరుడు పెట్టిన పేరు మీదుగా ఈ ప్రదేశానికి భారత్ మండపం అని పేరు పెట్టడం గమనార్హం, ఈ Anubhava Mantapa బహిరంగ వేడుకలకు గొప్ప ప్రదేశం .
డిజైన్
ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో కేంద్ర భాగంగా భారత్ మండప కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి చేయబడింది. కన్వెన్షన్ సెంటర్ భవనం నిర్మాణ రూపకల్పన భారతీయ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందింది. సౌరశక్తిని వినియోగించుకోవడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేయడానికి వివిధ గోడలు, ముఖభాగాలు కూడా నిర్మించబడ్డాయి.
సిడ్నీ ఒపెరా హౌస్ కంటే పెద్ద కెపాసిటీ
ఈ భారత్ మండపంలో మల్టీపర్పస్ హాల్, ప్లీనరీ హాల్ రెండూ 7000 మంది కూర్చునే సామర్ధ్యం ఉంది. ఈ హాల్ ఆస్ట్రేలియాలోని పాపులర్ సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ. ఇక్కడి యాంఫిథియేటర్‌లో 3000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
స్పెషల్ ఫీచర్స్
ప్రగతి మైదాన్‌లోని ఈ IECC క్యాంపస్‌లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో అనేక సమావేశ గదులు, లాంజ్‌లు ఇంకా ఆడిటోరియంలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బిజినెస్ సెంటర్ వివిధ పెద్ద ఈవెంట్‌లను నిర్వహించడానికి బాగా స్థాపించి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (28 అడుగుల ఎత్తు) నటరాజ విగ్రహం ఈ భారత మండపం ముందు ఉంది.
భారతదేశపు అతిపెద్ద MICE
సుమారు 123 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద MICE (మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్స్)గా అభివృద్ధి చేయబడింది. దీనిని పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించబడింది.