గూగుల్ క్రోమ్‌కు పోటీగా పర్‌ప్లెక్సిటీ AI బ్రౌజర్.. కామెట్ ఫీచర్లు ఏంటో తెలుసా?

Published : Sep 25, 2025, 12:24 AM IST

Perplexity AI Comet Browser: పర్‌ప్లెక్సిటీ ఏఐ తన కొత్త కామెట్ బ్రౌజర్‌ను భారత్‌లో ప్రారంభించింది. ఇది క్రోమ్ ఎక్స్‌టెన్షన్లు, ఏఐ సహాయం, వర్క్‌స్పేస్ ఫీచర్లను అందిస్తుంది. మరి గూగుల్ క్రోమ్ కు పోటీ ఇస్తుందా? కామెట్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
పర్‌ప్లెక్సిటీ AI వెబ్ బ్రౌజర్ కామెట్ రిలీజ్

Perplexity AI browser Comet: పర్‌ప్లెక్సిటీ AI తన కొత్త వెబ్ బ్రౌజర్ ‘కామెట్’ ‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది గూగుల్ క్రోమ్‌కు ప్రత్యక్ష పోటీగా వస్తోంది. క్రోమియం ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా నిర్మించిన ఈ బ్రౌజర్, క్రోమ్ ఎక్స్‌టెన్షన్లు, బుక్‌మార్క్‌లకు మద్దతు ఇస్తుంది. అయితే, దీని ప్రత్యేకత, AI ఆధారిత టూల్స్. ఇవి సెర్చ్, పరిశోధన, కంటెంట్ క్రియేషన్, ప్రొడక్టివిటీ, మల్టీటాస్కింగ్‌ను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి.

25
పర్‌ప్లెక్సిటీ ఐఏ కామెట్ బ్రౌజర్ ముఖ్య ఫీచర్లు ఏంటి?

• AI సైడ్‌బార్ అసిస్టెంట్: ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఆర్టికల్‌లను సారాంశం చేయించుకోవచ్చు, ఇమెయిల్స్ డ్రాఫ్ట్ చేయవచ్చు, షెడ్యూల్ మేనేజ్ చేయవచ్చు. అంతేకాక, అనుమతి ఇచ్చిన లావాదేవీలను కూడా పూర్తి చేస్తుంది.

• క్రోమియం బెస్డ్ ప్రేమ్ వర్క్: యూజర్లు క్రోమ్ నుంచి మారేటప్పుడు కొత్త అనుభవం కాకుండా సుపరిచితమైన వాతావరణం ఉంటుంది. అంటే క్రోమియం వర్క్ ప్రేమ్ తో పర్‌ప్లెక్సిటీ ఏఐ బ్రౌజర్ ను తీసుకొచ్చారు. అక్కడి డేటాను ఈజీగానే ఇందులోకి మారుతుంది.

• వర్క్‌స్పేస్ ఆర్గనైజేషన్: ప్రాజెక్టులు, టాస్కులు, ట్యాబ్‌లను వర్గీకరించి ఉంచుకోవడానికి "వర్క్‌స్పేస్" సదుపాయం కూడా ఉంది. ఇది ప్రొడక్టివిటీని పెంచుతుంది.

• పర్సనలైజ్డ్ రికమెండేషన్స్: యూజర్ ప్రవర్తనను బట్టి సంబంధిత కంటెంట్, ప్రోడక్టులు, ఆర్టికల్స్ ను కూడా సూచిస్తుంది.

• టాస్క్ ఆటోమేషన్: మీటింగ్ బుకింగ్, ధరల పోలిక, వెబ్‌పేజీలను ఇమెయిల్‌గా మార్చడం వంటి పనులను ఆటోమేటిక్‌గా కామెట్ చేస్తుంది.

• ప్రొడక్టివిటీ టూల్స్: ఇమెయిల్ ప్రాధాన్యత కేటాయింపు, టాస్క్ మేనేజ్‌మెంట్ డ్యాష్‌బోర్డ్, ఫ్యాక్ట్-చెకింగ్, కంటెంట్ జనరేషన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

• రిసెర్చ్, మల్టీమీడియా సపోర్ట్: పరిశోధకులు, కంటెంట్ క్రియేటర్ల కోసం రైటింగ్ సహాయం, సమ్మరీ టూల్స్, మల్టీమీడియా కంటెంట్ సృష్టించడం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

35
భారత్‌లో అందుబాటులోకి వచ్చిన పర్‌ప్లెక్సిటీ ఐఏ కామెట్ బ్రౌజర్

కామెట్ బ్రౌజర్ ప్రస్తుతం పర్‌ప్లెక్సిటీ ప్రో యూజర్లకు విండోస్, మ్యాక్ ఓఎస్ ‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. iOS సపోర్ట్ అభివృద్ధిలో ఉందని కంపెనీ తెలిపింది.

భారత్‌లో మరింత ప్రాచుర్యం కోసం, పర్‌ప్లెక్సిటీ ఐఏ భారతి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం చేసింది. దీని ద్వారా లక్షలాది మంది యూజర్లకు ఒక సంవత్సరం పాటు ఉచిత ప్రో సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.

45
పర్‌ప్లెక్సిటీ ఐఏ కామెట్ బ్రౌజర్ ను ఎలా ఉపయోగించాలి

1. ముందుగా Perplexity Pro లేదా Max ప్లాన్‌లో లాగిన్ కావాలి.

2. అధికారిక వెబ్‌సైట్ నుంచి కామెట్ బ్రౌజర్ డౌన్‌లోడ్ చేయాలి లేదా ఆండ్రాయిడ్ (Android) యూజర్లు ప్రీ-ఆర్డర్ లింక్ ఉపయోగించాలి.

3. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత AI సైడ్‌బార్‌ను యాక్టివేట్ చేయాలి.

4. వర్క్‌స్పేస్‌లలో ట్యాబ్‌లు, ప్రాజెక్టులు సమూహంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

5. ఆర్టికల్స్ సమ్మరీ చేయించడం, ఇమెయిల్స్ డ్రాఫ్ట్ చేయించడం, ధరలు పోల్చడం వంటి పనులు అదే బ్రౌజర్‌లో ఈజీగా చేయవచ్చు.

55
పర్‌ప్లెక్సిటీ ఐఏ భవిష్యత్ ప్లాన్స్ ఏంటి?

పర్‌ప్లెక్సిటీ ఐఏ కామెట్‌ను నెక్స్ట్ జెన్ బ్రౌజర్ గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేవలం బ్రౌజింగ్‌కే పరిమితం కాకుండా, AI ఆధారిత టాస్క్ మేనేజ్‌మెంట్ ను అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లు జోడించనున్నట్టు తెలిపింది. ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్లకు ఇది బెస్ట్ ఎంపిక అవుతుందని కంపెనీ చెబుతోంది. గూగుల్ క్రోమ్ ఆధిపత్యానికి సవాలు విసురుతూ, ఇంటెలిజెంట్, ఏఐ ప్రాక్టికల్ టూల్స్‌తో కూడిన బ్రౌజింగ్ అనుభవంను కామెట్ అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories