5 కెమెరాలు, 5జి సపోర్ట్‌తో ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు మీకోసం..

First Published | Feb 25, 2021, 6:28 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో  కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 5కెను ఇండియన్ మార్కెట్లోకి  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో రెనో సిరీస్ నుండి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్. ఒప్పో రెనో 5కె క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, పంచ్‌హోల్ డిస్ ప్లేతో పరిచయం చేసింది. ఒప్పో రెనో 5కె 5జి స్నాప్‌డ్రాగన్ 750g ప్రాసెసర్‌తో లాంచ్ చేసినట్లు తెలిపింది. క్వాడ్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లోప్రత్యేకంగా అందించారు.
 

ఒప్పో రెనో 5కె ధరప్రస్తుతానికి ఒప్పో రెనో 5కె ధర గురించి ఎటువంటి సమాచారం లేదు, కాని లీకైన కొన్ని నివేదికల ప్రకారం ఒప్పో రెనో 5కె 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 చైనీస్ యువాన్ అంటే సుమారు 32,500 రూపాయలు. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,199 చైనీస్ యువాన్ అంటే 35,900 రూపాయలు. ఈ ఫోన్ మార్చి 6 నుండి చైనాలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ను గ్రీన్ బ్రీజ్, మిడ్‌నైట్ బ్లాక్, స్టెరి డ్రీమ్ కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 5కె స్పెసిఫికేషన్లుఆండ్రాయిడ్ 11.1 కలర్‌ ఓఎస్ ఒప్పో రెనో 5కెలో అందించారు. 6.43 అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఓలేడ్ డిస్ ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్‌లో అగ్రినో 619 జిపియు గ్రాఫిక్‌లతో కూడిన స్నాప్‌డ్రాగన్ 750 జి ప్రాసెసర్, 12 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజ్ అందించారు.

ఒప్పో రెనో 5కె కెమెరాకెమెరా గురించి చెప్పాలంటే ఒప్పో ఈ కొత్త ఫోన్ నాలుగు బ్యాక్ కెమెరాలను ఇచ్చింది. దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ దీని ఎపర్చరు f1.7.రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా దీని ఎపర్చరు f2.2.మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ కెమెరా, నాల్గవది 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా. సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఒప్పో రెనో 5కె బ్యాటరీఒప్పో రెనో 5కెలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, కనెక్టివిటీ కోసం 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్‌లో ఇండిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫోన్‌లో డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంది, ఇది 4300 ఎంఏహెచ్. సూపర్‌వూక్ 2.0, సూపర్‌వూక్ విఒసి 3.0, క్యూసి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Latest Videos

click me!