1. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అంటే ఏమిటి?మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అనేది ఒక టెలికమ్యూనికేషన్ సర్వీస్ వినియోగదారుని ప్రాంతంతో సంబంధం లేకుండా ఒక ఆపరేటర్ నుండి మరొక ఆపరేటర్‌కు మారడానికి అనుమతించే ఫీచర్ (ఉదా. ఢీల్లీ నుండి ముంబై వరకు). ఒక కస్టమర్ తన ప్రస్తుత ఆపరేటర్ సేవలతో సంతృప్తి చెందకపోతే, అతను తన మొబైల్ నంబర్‌ను తనకు నచ్చిన ఇతర టెలికాం సర్వీస్ (జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇంకా బిఎస్‌ఎన్‌ఎల్) మరవచ్చు.
undefined
2. యూనిక్ పోర్టింగ్ కోడ్ (యుపిసి) పొందటానికి అర్హత ఏమిటి?మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ అవసరం. ఈ కోడ్ ద్వారా మాత్రమే మీ నంబర్ మరొక టెలికాం ఆపరేటర్‌కు పోర్ట్ చేయబడుతుంది. ఎంఎన్‌పికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. మీరు ప్రస్తుత ఆపరేటర్ నెట్‌వర్క్‌లో 90 రోజులు ఆక్టివ్ లేకపోతే, మీరు మీ నంబర్‌ను పోర్ట్ చేయలేరు, అంటే కనీసం 90 రోజుల వాడిన ఒక పాత నంబర్‌ను పోర్ట్ చేయవచ్చు.
undefined
3. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం విధానం ఏమిటి?మీరు ప్రస్తుతం వాడుతున్న మీ ఆపరేటర్‌తో సంతృప్తి లేకుంటే 'PORT' అని టైప్ చేసి మే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 1900 కు మెసేజ్ పంపండి. దీని తరువాత మీకు నంబర్‌పై యుపిసి కోడ్ మెసేజ్ వస్తుంది. దీని తరువాత మీరు సమీప టెలికాం స్టోర్ వెళ్లి గుర్తింపు కార్డు ఇంకా ఫోటో ఇవ్వడం ద్వారా కొత్త టెలికాం ఆపరేటర్ సిమ్ కార్డు పొందవచ్చు. మీ నంబర్ పోర్టింగ్ 3-5 రోజుల్లో పూర్తవుతుంది. అలాగే కార్పొరేట్ నంబర్ పోర్టింగ్ విషయంలో పోర్టింగ్ సమయం 5 రోజులు. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య ప్రాంతాలలో పోర్టింగ్ సమయం 15 రోజులు. కొత్త సిమ్ పనిచేయడానికి ముందు మీకు ఎస్‌ఎంఎస్ వస్తుంది, ఇందులో పోర్టింగ్ తేదీ అలాగే సమయం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
undefined
4. కొత్త సిమ్ పోర్ట్ అయిన తర్వాత దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలిమీ ప్రస్తుత నంబర్ నెట్‌వర్క్ నిర్ణీత సమయం, తేదీలో డి-ఆక్టివేట్ అయిన వెంటనే, మీరు ఫోన్‌లో కొత్త సిమ్‌ను వేయండి. నెట్‌వర్క్ కొద్దిసేపట్లో వస్తుంది. ఆ తరువాత సిమ్ కార్డుతో ప్యాకెట్‌లో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేసి ధృవీకరణ చేయవలసి ఉంటుంది, దీంతో మీ కొత్త సిమ్ ప్రారంభించబడుతుంది.
undefined
5. పోర్టింగ్‌ను ఉపసంహరించుకోవడం ఎలా?మీ నంబర్‌ను 1900 కు పోర్ట్ చేయడానికి మీరు మెసేజ్ పంపినట్లయితే, పోర్టింగ్ ప్లాన్ మారితే మీరు పోర్టింగ్ అభ్యర్థనను 24 గంటల్లో ఉపసంహరించుకోవచ్చు. పోర్టింగ్‌ను రద్దు చేయడానికి మీరు మెసేజులో 'క్యాన్సెల్' అని టైప్ చేసి మే నంబర్ ఎంటర్ చేసి 1900 కు పంపాలి.
undefined
6. మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి ఛార్జీలు ఏమిటి?మీ నంబర్ పోర్ట్ చేయడానికి కొత్త సిమ్ కార్డు కోసం మాత్రమే చార్జి వసూలు చేస్తారు. తరువాత మీరు కొత్త టెలికాం ప్లాన్ ఎంపిక పై ఆధారపడి ఉంటుంది ఇది మీ మొదటి రీఛార్జ్ గా చేయవలసి ఉంటుంది.గమనిక - పోర్టింగ్ చేసిన తర్వాత మీ ప్రస్తుత నంబర్ పై ఉన్న అన్ని సేవలు, బ్యాలెన్స్ మొదలైనవి ముగుస్తాయి.
undefined