పెద్ద బ్యాటరీ, 4 కెమెరాలతో ఒప్పో సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. అతితక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్లు..

First Published Apr 20, 2021, 12:39 PM IST

స్మార్ట్ ఫోన్ తయారీ  బ్రాండ్ ఒప్పో  కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎ54ను భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. మీడియా టెక్ హెలియో పి35 ప్రాసెసర్‌, పెద్ద 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ రియర్ కెమెరాతో  వస్తున్న ఒప్పో ఎ74 5జిని తాజాగా ఇండియాలో  లాంచ్ చేశారు.
 

ఒప్పో ఎ54ధర4 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .14,490, 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ ధర రూ .15,990. ఈ ఫోన్ క్రిస్టల్ బ్లాక్, మూన్లైట్ గోల్డ్, స్టెరి బ్లూ వంటి 3 రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ సేల్స్ నేటి నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ .1000 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తోంది.
undefined
ఒప్పో ఎ54 స్పెసిఫికేషన్లుఅండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7.2, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేటు, బ్రైట్ నెస్ 550 నిట్స్, ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి 35 (ఎమ్‌టి 6765 వి) ప్రాసెసర్, 6 జిబి వరకు ర్యామ్ అండ్ 128 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది, దీనిని మెమరీ కార్డ్ సహాయంతో మరింత పెంచుకోవచ్చు.
undefined
ఒప్పో ఎ54 కెమెరాకెమెరా గురించి చెప్పాలంటే దీనికి మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో మొదటి లెన్స్ 13 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
undefined
ఒప్పో ఎ54 బ్యాటరీదీనిలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం 4 జి, వై-ఫై, బ్లూటూత్ 5, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్, ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కోసం IPX4గా రేట్ చేయబడింది.
undefined
click me!