ఒప్పో ఏ53ఎస్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం భారత మార్కెట్లో ఇది చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా మారింది. దీనికి 13ఎంపి ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఒప్పో ఏ53ఎస్ 5జిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ లభిస్తుంది ఇది 5 జి ప్రాసెసర్.
ఒప్పో ఏ53ఎస్ ధర6జిబి + 128జిబి వేరియంట్ ధర భారతదేశంలో రూ.14,990, 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.16,990. మే 2న మధ్యాహ్నం 12 గంటలకు నుండి ఫ్లిప్‌కార్ట్ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. క్రిస్టల్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే దీని ధర కారణం ఈ ఫోన్ ఇప్పుడు భారతదేశంలో చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్‌గా మారింది. ఇంతకుముందు రియల్‌మీ 8 5జిని రూ.14,999 విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ గురించి మాట్లాడితే ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ .1,250 వరకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది.
ఒప్పో ఏ53ఎస్ 5జి స్పెసిఫికేషన్లుఈ కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ఓఎస్ 11.1 లో పనిచేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లభిస్తుంది.
మెమొరీ కార్డు సహాయంతో మెమరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ విషయానికొస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి మాక్రో కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా లభిస్తుంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా అందించారు.
ఒప్పో ఏ53ఎస్ బ్యాటరీదీనికి 5,000mAh, 10W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్-మోడ్ 5జి, 4 జి, వైఫై, బ్లూటూత్, జిపిఎస్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.