ఆపిల్, వివో, ఆసుస్, షియోమి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరకే అందించనున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు, టీవీలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది.అలాగే బట్టలు, కిరాణా, ఫర్నిచర్, మరిన్ని వస్తువులుపై కూడా ఆఫర్లు తీసుకొచ్చింది.
బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త మైక్రోసైట్ రూపొందించింది. ఈ వెబ్ పేజీ ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ సేల్, బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపు, జీరో ఈఎంఐ ఆప్షన్ తో పాటు ఎక్స్ఛేంజ్ డీల్స్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కొన్ని బెస్ట్ ఆఫర్‌లుటాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే ప్రస్తుతం రూ.54,900 ధర వద్ద అమ్ముడవుతున్న ఆపిల్ ఐఫోన్ 11 ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ.44,999 అందిస్తుంది. అదేవిధంగా ఆసుస్ రోగ్ ఫోన్ 3 రూ.46,999కి లభిస్తుంది, దీని అసలు ధర రూ.55,999.
అలాగే మరిన్ని పాకెట్-ఫ్రెండ్లీ ప్రాడెక్ట్స్ పై సేల్ సమయంలో తగ్గింపును చూస్తారు. ఉదాహరణకు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఐక్యూయూ 3 రూ.24,990 వద్ద రిటైల్ అవుతుంది. షియోమి ఎంఐ10టి ప్రారంభ ధర రూ .27,999 వద్ద లభిస్తుంది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లుబిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ రూ.9,999 ధరకే శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్12 ను అందించనుంది. మరోవైపు 6జిబి+ 64జిబి స్టోరేజ్ వేరియంట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్41 ధర రూ .12,499తో ప్రారంభమవుతుంది. 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ .14,499 కు లభిస్తుంది. శామ్‌సంగ్ అందించే మరింత శక్తివంతమైన ఆఫర్ గెలాక్సీ ఎఫ్62 దీనిని రూ .17,999 కు అందిస్తున్నారు.
ఇతర డిస్కౌంట్లుస్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే కాకుండా ఇతర గాడ్జెట్లు, ఉపకరణాల పై కూడా సేల్ సమయంలో డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70 శాతం వరకు, ప్రాసెసర్‌లు, గ్రాఫిక్స్ వంటి కంప్యూటర్ భాగాలపై 60 శాతం వరకు, అలాగే టాప్ బ్రాండ్ల నుండి ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపును సూచిస్తుంది.
ఈ సేల్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు వారికి ఇఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును, స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో ఫ్లిప్‌కార్ట్ కనీస రూ .1000 గ్యారెంటీని కూడా అందిస్తోంది.