తాజాగా 2021 సంవత్సరంలో ఆపిల్ కొత్త మోడల్ ఐఫోన్ 13 మినీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని కింద ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ తో మొత్తం నాలుగు ఐఫోన్‌లను విడుదల చేయనున్నారు.
ఐఫోన్ 13 మినీ మొదటి ఫోటో లీక్ అయినప్పటికీ దాని ఫీచర్స్ గురించి కూడా ఇంకా రహస్యంగానే ఉంది. చైనా సోషల్ మీడియా సైట్ ఐఫోన్ 13 మినీ ఫోటో గురించి వెల్లడించింది.
లీకైన ఫోటోలో ఐఫోన్ 13 మినీ బ్యాక్ ప్యానెల్ కెమెరాను చూపిస్తుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే దీని డిజైన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. బ్యాక్ కెమెరా సెన్సార్ ఉన్న ప్రదేశంలో మార్పు చేసినట్లు తెలుస్తుంది.
ఐఫోన్ 13 మినీ బ్లూ కలర్ వేరియంట్లో రానున్నట్లు లీక్ అయిన ఫోటో సూచిస్తుంది, అయితే ఇది ఐఫోన్ 12 మినీ లాగానే ఉండనుంది. కానీ లాంచ్ సమయంలో మరిన్ని కలర్స్ లో అందుబాటులోకి తీసుకురవొచ్చు. ఐఫోన్ 13 మినీ లాగానే ఐఫోన్ 13 సిరీస్ బాక్సీ డిజైన్‌ను కూడా పొందుతుంది.
ముఖ్యంగా కొన్ని కొత్త ఫీచర్స్ ఐఫోన్ 13 కెమెరాలో చూడవచ్చు. అంతేకాకుండా ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను ఐఫోన్ 13 మినీలో అందించనున్నారు. ఆపిల్ ఇటీవల 24 అంగుళాల సైజ్ లో కొత్త ఐమాక్‌ను, కొత్త ఆపిల్ ఐప్యాడ్ ప్రోను కూడా ప్రవేశపెట్టింది.