వన్‌ప్లస్ 6టి లాంటి మరో స్లిమ్ 5జి స్మార్ట్ ఫోన్.. 12 జిబి ర్యామ్, పెద్ద బ్యాటరీతో వచ్చేస్తోంది.. ధర ఎంతంటే ?

First Published | Jun 11, 2021, 1:27 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జిని భారతదేశంలో విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌ నుండి వస్తున్న రెండవ ఫోన్ ఇది. ఈ కొత్త ఫోన్ వన్‌ప్లస్ నార్డ్  కి అప్‌గ్రేడ్ వెర్షన్, దీనిని గత ఏడాది జూలైలో ప్రారంభించారు. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి వన్‌ప్లస్ 6టి తర్వాత వస్తున్న సన్నని స్మార్ట్‌ఫోన్. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జిని మాట్టే, షైన్ బ్యాక్ ఫినిష్‌ రంగులలో  కొనుగోలు చేయవచ్చు. 
 

వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి ధరవన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి ప్రారంభ ధర రూ .22,999. ఈ ధర వద్ద 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .24,999. ఫోన్ టాప్ వేరియంట్ 12 జిబి ర్యామ్, 256 జిబి ధర రూ.27,999. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి అమెజాన్ ఇండియా అండ్ వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో బ్లూ వాయిడ్, చార్‌కోల్ ఇంక్, సిల్వర్ రే రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జూన్ 16 నుండి ప్రారంభమవుతాయి. మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే మీకు 1,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
స్పెకిఫికేషన్లువన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జిలో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 11, 6.80-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌, డిస్ ప్లే రిఫ్రెష్ రేటు 90Hz. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750 జి ప్రాసెసర్, అడ్రినో 619 జిపియు గ్రాఫిక్స్, 12 జిబి ర్యామ్ అండ్ 256 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు.

వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి కెమెరాఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ ఎపర్చరు ఎఫ్ 1.79 దీనితో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఇచ్చారు. మరోవైపు రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ తో ఎపర్చరు f2.25, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది. కెమెరా నుండి 4కె వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి బ్యాటరీఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్‌లో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్ నావిక్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, సూపర్ లీనియర్ స్పీకర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Latest Videos

click me!