ఒప్పో, షియోమీకి పోటీగా మోటో జి స్టైలస్ 5జి స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..

First Published | Jun 10, 2021, 5:48 PM IST

 లెనోవా యాజమాన్యంలోని సంస్థ మోటరోలా కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ మోటో జి స్టైలస్ ని విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో ఈ ఫోన్ 4జీ వెర్షన్ ని లాంచ్ చేశారు. మోటో జి స్టైలస్ 5జిలో నాలుగు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు. 

అంతేకాకుండా పంచ్ హోల్ డిస్ ప్లే, సెల్ఫి కెమెరా కూడా అందించారు. ఈ 5జి వేరియంట్ స్మార్ట్ ఫోన్ డిజైన్ 4జీ మోడల్‌కు పోలి ఉంటుంది. అయితే కెమెరా మాడ్యూల్ కొద్దిగా సవరించారు. ఫోన్‌తో స్టైలస్ పెన్ కూడా లభిస్తుంది.
undefined
మోటో జి స్టైలస్ 5జి ధరమోటో జి స్టైలస్ 5జి ధర 399 డాలర్లు అంటే సుమారు రూ.29,100. ఈ ధర వద్ద 6 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌ని సింగిల్ కలర్ వేరియంట్ కాస్మిక్ గ్రీన్ రంగులో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫోన్ భారత మార్కెట్లో లభించే అవకాశం లేనప్పటికీ జూన్ 14 నుండి సేల్స్ యు.ఎస్‌లో ప్రారంభంకానున్నాయి.
undefined

Latest Videos


మోటో జి స్టైలస్ 5జి స్పెసిఫికేషన్లుమోటో జి స్టైలస్ 5జిలో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అందించారు. అంతేకాకుండా 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480 5జి ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు.
undefined
మోటో జి స్టైలస్ 5జి కెమెరాఈ మోటరోలా ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు ఎఫ్1.7, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ దీని ఎపర్చరు f2.2, మూడవ లెన్స్ 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ లెన్స్ ఇచ్చారు.
undefined
మోటో జి స్టైలస్ 5జి బ్యాటరీకనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5జి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జిపిఎస్ఎ-జిపిఎస్, టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. వెనుక ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. 10Wఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది.
undefined
click me!