ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ డిస్ ప్లేతో రెండు కెమెరాలు అందుబాటులో ఉంటాయి. ఒక కెమెరా ఫోటోల కోసం, మరొకటి ఫేస్‌బుక్ వీడియోలను షేర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. అలాగే మీరు స్మార్ట్ వాచ్ తో వచ్చే ఫ్రంట్ కెమెరాతో వీడియో కాలింగ్ కూడా చేయవచ్చు. కెమెరాలో ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. ఈ కెమెరా వీడియో క్వాలిటీ 1080 పిక్సెల్స్. వ్యాక్ ప్యానెల్ కెమెరా వీడియో రికార్డింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకా బ్యాక్ ప్యానెల్ స్టెయిన్ లెస్ స్టీల్ తో వస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఫేస్ బుక్ మొదటి స్మార్ట్ వాచ్ కోసం బ్యాక్ ప్యాక్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది.
undefined
ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే స్మార్ట్‌వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌గా ఉపయోగించడం. ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేనప్పటికీ, ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ ఆపిల్, గూగుల్ వంటి సంస్థలతో పోటీ పడనుంది.
undefined
ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్‌లో కూడా ఎల్‌టిఇ కనెక్టివిటీ లభిస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దీని కోసం సంస్థ కొన్ని అమెరికన్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తుంది. ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ టెలికాం కంపెనీల ఫ్లాట్ ఫార్మ్ ద్వారా విక్రయించవచ్చు.
undefined
ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్‌ను వైట్, బ్లాక్, గోల్డ్ కలర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. లీకైన నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ ధర 400 డాలర్లకు దగ్గరగా ఉంటుంది అంటే సుమారు రూ.30 వేలు. స్మార్ట్ వాచ్ పేరు గురించి కూడా ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.
undefined