ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీని అందించారు. దీంతో రోజంతా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ను 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 5 గంటలపాటు Prime Video చూడొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఈ బ్యాటరీ 100W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 28 నిమిషాల్లో 100% చార్జ్ అవుతుంది. ఏఐ బ్యాటరీ హెల్త్ ఇంజన్‌తో 4 ఏళ్ల వరకు బ్యాటరీ ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒకటి కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మరొకటి. ఇక డిజైన్ విషయానికొస్తే మెటల్ యూనిబాడీ డిజైన్ – 0.8mm మందం, స్ట్రాంగ్ తో పాటు ఎలిగెంట్ లుక్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను మెర్క్యూరియల్ సిల్వర్, ఓయాసిస్ గ్రీన్, ఆబ్సిడియన్ మిడ్ నైట్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.