మీ ఫ్యామిలీకి సరిపోయే ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఫ్రీ..

First Published | Jun 2, 2021, 5:14 PM IST

లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు వారి ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాసులు, ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు గతంలో కంటే ఎక్కువ డేటా వినియోగం అవసరం. 

ఇందుకు దేశీయ టెలికాం ఎయిర్‌టెల్ ప్రస్తుత పరిస్థితులకు అనువైన రిచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో హై స్పీడ్ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, కుటుంబ సభ్యులను చేర్చే అవకాశాన్ని కూడా మీరు పొందుతారు. అయితే ఆ ప్లాన్ గురించి తెలుసుకుందాం ...
undefined
ఈ ఎయిర్‌టెల్ రూ .1999 ప్లాన్ అత్యంత ఖరీదైన పోస్ట్‌ పెయిడ్ వన్ ఎయిర్‌టెల్ ప్లాన్, అయితే ఈ ప్లాన్ అన్ని సర్కిల్‌లకు కాదు. బెంగళూరు, ఢీల్లీ, భోపాల్ వంటి నగరాల వినియోగదారులు ఈ ప్లాన్ సద్వినియోగం చేసుకోవచ్చు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ప్లాన్ మీ సర్కిల్‌లో అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
undefined

Latest Videos


ఈ ప్లాన్ ప్రయోజనాల గురించి మాట్లాడితే మీరు ఈ ప్లాన్ కోసం రూ.1,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉంటే లేదా ముగ్గురు వ్యక్తుల బృందం ఉంటే ఈ ప్రణాళిక మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్లాన్ తో మూడు కనెక్షన్లను ఉపయోగించుకొవచ్చు. అయితే అన్ని సిమ్‌లు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ మాత్రమే. ఈ ప్రణాళిక ప్రకారం, 75 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. దానితో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాల్స్ చేసే సౌకర్యం కూడా లభిస్తుంది.
undefined
ఈ ప్లాన్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్లాన్ డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) కనెక్షన్ ఇంకా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో పాటు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో కూడా వస్తుంది. డిటిహెచ్ కోసం వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ లభిస్తుంది, ఇంకా రూ .444 ప్యాక్ కూడా ఉచితంగా ఇస్తుంది.
undefined
ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కింద 200 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కూడా ఒక సంవత్సరానికి అందుబాటులో ఉంటుంది.
undefined
click me!