ఇండియాలోనే మొట్టమొదటి 5జీ డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్ కూడా అదుర్స్..

First Published | Jun 2, 2021, 12:26 PM IST

చైనా మొబైల్ తయారీ సంస్థ  రియల్‌మీ తాజాగా ఎక్స్ 7మాక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది అలాగే 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ ఎక్స్ 7 మాక్స్ 5జి రిబ్యాడ్జ్ చేసిన రియల్‌మీ జిటి నియో, దీనిని మార్చి చివరిలో చైనాలో విడుదల చేశారు.  

భారతదేశంలో రియల్‌మీ ఎక్స్ 7మాక్స్ 5జి ధర 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.26,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది దీని ధర రూ.29,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్టరాయిడ్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్, మిల్కీ వే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయించనున్నారు.
undefined
ఈ ఫోన్ సంస్థ 'రియల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్'లో ఒక భాగం అవుతుంది, దీని కింద కస్టమర్లు సంవత్సరానికి 70 శాతం ధరను ఫోన్‌పై పొందగలుగుతారు. వచ్చే ఏడాది ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ చేసే అవకాశం లభిస్తుంది. రియల్‌మీ ఎక్స్7 మాక్స్ 5జి స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్, షియోమి ఎం‌ఐ 11ఎక్స్ వంటి స్మార్ట్ ఫోన్లతో పోటీగా నిలుస్తుంది.
undefined

Latest Videos


రియల్‌మీ ఎక్స్7మాక్స్ 5జి స్పెసిఫికేషన్లుడ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 రియల్‌మీ యుఐ 2.0, 6.43-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ రేటు, డిస్ ప్లే 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 100 శాతం డిసిఐ-పి 3 కలర్ గాముట్, 91.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. హుడ్ కింద ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC తో పాటు 12జి‌బి వరకు ర్యామ్ ఇచ్చారు.
undefined
అలాగే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX682 సెన్సార్ ఎఫ్ 1.8 లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రియల్‌మీ ఎక్స్ 7మాక్స్ 5జి ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ ఎఫ్ 2.5 లెన్స్‌తో అందిస్తుంది.
undefined
రియల్‌మీ ఎక్స్‌మ్యాక్స్ 5జిలో 256 జిబి వరకు యుఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.1, జిపిఎస్ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటి సెన్సార్ ఉన్నాయి. ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
undefined
ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్, హాయ్-రెస్ ఆడియో సపోర్ట్‌తో వస్తుంది ఇంకా ఐపిఎక్స్ 4 వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌ ఉంది. రియల్‌మీ ఎక్స్7మ్యాక్స్ 5జిలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు, 50W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ 158.5x73.3x8.4ఎం‌ఎం సైజులో 179 గ్రాముల బరువు ఉంటుంది.
undefined
click me!