దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.7శాతం. దీని డిజైన్ కాకుండా ఈ టీవీ మొత్తం పాత మోడల్ లాగానే ఉంటుంది. కొత్త టీవీ సంస్థ ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌తో ముందే లోడ్ చేసి వస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్‌తో యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోడ్, సెలబ్రిటీ వాచ్‌లిస్ట్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి.
ఎంఐ టివి 4ఎ40 హారిజన్ ఎడిషన్ ధరఈ టివి ధర రూ .23,999. దీని సేల్స్ జూన్ 2 నుండి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ స్టూడియో, మీ రిటైల్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ టీవీ సేల్ జరుగుతుందని కంపెనీ తెలిపింది. లాంచ్ ఆఫర్ గురించి మాట్లాడితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ కస్టమర్లకు రూ.1000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ కూడా రూ.11 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది.
ఎంఐ టివి 4ఎ40 హారిజోన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ఎంఐ టివి 4ఎ 40 హారిజన్ ఎడిషన్‌కు ప్యాచ్‌వాల్ కొత్త వెర్షన్‌తో ఆండ్రాయిడ్ టివి 9.0, 40 అంగుళాలు స్క్రీన్ సైజ్, ఫుల్ హెచ్‌డి 1920x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 178 డిగ్రీల టీవీ వ్యూ ఆంగిల్, షియోమి వివిడ్ పిక్చర్ ఇంజిన్ (వీపీఈ) టెక్నాలజీ కూడా టీవీతో లభిస్తుంది. టీవీలో 10W రెండు స్పీకర్లు ఉన్నాయి, అంటే మొత్తం 20W స్టీరియో స్పీకర్లు ఇచ్చారు, వీటితో డిటిఎస్-హెచ్‌డి సపోర్ట్ కూడా ఉంది.
ఈ టీవిలో అమ్లాజిక్ కార్టెక్స్-ఎ 53 ప్రాసెసర్ ఇచ్చారు, ఇది క్వాడ్‌కోర్ ప్రాసెసర్. అంతేకాకుండా గ్రాఫిక్స్ కోసం మాలి -450 జిపియు, 1 జిబి డిడిఆర్ ర్యామ్, 8 జిబి ఇఎంఎంసి స్టోరేజ్ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం టీవీలో వై-ఫై 802.11 బి జి ఎన్, బ్లూటూత్ వి4.2, రెండు యుఎస్‌బి 2.0 పోర్ట్‌లు, మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, ఈథర్నెట్ ఎస్ పిడిఐఎఫ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
అలాగే వీడియో స్ట్రీమింగ్ కోసం ప్రత్యేక బటన్లు ఇచ్చారు. ఈ టీవీని కేవలం 5 సెకన్లలో ఆన్ చేయవచ్చని పేర్కొంది. ఇందుకు ప్రీలోడ్ చేసిన ఎంఐ క్విక్ వేక్ ఫీచర్‌ను అందించారు. ఎంఐ స్మార్ట్ హోమ్ డివైజెస్ ని టీవీతో కూడా కంట్రోల్ చేయవచ్చు. టీవీ మొత్తం బరువు 5.48 కిలోలు.