వాట్సాప్‌లో రానున్న మరో గొప్ప ఫీచర్.. ఇక మీరు వాటిని పంపే ముందు ఎడిట్ చేయవచ్చు..

First Published Feb 9, 2021, 11:02 AM IST

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది, దీని సహాయంతో మీరు వీడియోను ఎవరికైనా పంపే ముందు మ్యూట్ చేయవచ్చు. వాట్సాప్  బీటా యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.  
 

కానీ త్వరలోనే ఈ ఫీచర్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.3.13 లో చూడవచ్చు.
undefined
ఈ కొత్త అప్ డేట్ తరువాత వినియోగదారులు ఏదైనా వీడియొని ఎవరికైనా పంపే ముందు ఆ వీడియోలోని ఆడియోను ఆపివేయవచ్చు (మ్యూట్ చేయవచ్చు). అలాగే వీడియోను ఎడిట్ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది.
undefined
ఉదాహరణకు, మీరు వీడియోకు టెక్స్ట్ లేదా ఎమోజి మొదలైన వాటిని జోడించవచ్చు. ఈ సమాచారం బీటా వెర్షన్ స్క్రీన్ షాట్ నుండి తెలుస్తుంది.
undefined
గత సంవత్సరం నుండి వాట్సాప్ వీడియో మ్యూట్ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. గత ఏడాది నవంబర్‌లో ఐఫోన్ బీటా వెర్షన్‌లో దీనిని పరీక్షించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో తీసుకొస్తున్నారు.
undefined
ఈ ఫీచర్ తో మీరు వీడియోను వాట్సాప్‌లో పంపే ముందు దానిని ఎడిట్ చేసి లేదా ఆడియో మ్యూట్ చేసి లేదా స్టిక్కర్స్ యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ స్టేటస్ లో కూడా ఉపయోగించవచ్చు.
undefined
WABetaInfo దాని సంబంధించిన సమాచారం పై ఒక స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది, ఇందులో స్పీకర్ సింబల్ చూపిస్తుంది. వీడియోను పంపేటప్పుడు, స్పీకర్ సింబల్ పై నొక్కడం ద్వారా వీడియోకి చెందిన ఆడియో మ్యూట్ అవుతుంది, అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే ఉంది. మరోవైపు ఈ ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్‌లో ఉంది.
undefined
undefined
click me!