టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించనున్న వన్‌ప్లస్ కొ-ఫౌండేర్ కొత్త కంపెనీ.. నథింగ్ పేరుతో ప్రారంభం..

First Published Jan 28, 2021, 4:08 PM IST

చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ  కొత్త వెంచర్ పై చాలాకాలంగా  చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన చివరకు వెల్లడైంది. కార్ల్ పీ  నథింగ్ పేరుతో ఒక  కొత్త సంస్థను ప్రారంభించారు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ కార్ల్ పీ  కొత్త కంపెనీకి నథింగ్ అని పేరు పెట్టడం నిజం. ఈ పేరుకు  తెలుగు అనువాదం  'ఏమీ లేదు' అని.

ఈ ప్రత్యేకమైన పేరు గురించి కార్ల్ పీ మాట్లాడుతూ ప్రజల జీవితాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం ఈ పేరు వెనుక ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కొత్త సంస్థ నుండి స్మార్ట్ డివైజెస్ ఉత్పత్తి ఆశిస్తున్నప్పటికీ, కంపెనీ ఏ ఉత్పత్తులను తయారు చేస్తుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.
undefined
సి‌ఆర్‌ఈ‌డి వ్యవస్థాపకుడు కునాల్ షా కూడా కార్ల్ పీ కొత్త సంస్థ నథింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది, అయినప్పటికీ పెట్టుబడి మొత్తం గురించి ఎటువంటి సమాచారం లేదు. కార్ల్ పీ కొత్త వెంచర్‌లో పెట్టుబడులు పెట్టిన తొలి భారతీయుడు కునాల్ షా.
undefined
ఈ పెట్టుబడికి సంబంధించి, కునాల్ షా ఒక ప్రకటనలో "కార్ల్ పీ ఒక కొత్త వినియోగదారుల ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రారంభించబోతున్నాడు, అది టెక్ పరిశ్రమను కదిలించబోతోంది, దానిలో నేను భాగం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము " అని తెలిపాడు.
undefined
ఈ సంస్థ కోసం కార్ల్ పీకి 7 మిలియన్ డాలర్లు, అంటే 70 లక్షల నిధులు వచ్చాయి. కార్ల్ పీ అందుకున్న నిధులలో ఐప్యాడ్‌ రూపొందించిన టోనీ ఫాడెల్, ప్రసిద్ధ యూట్యూబర్ కేసీ నీస్టాట్, ట్విచ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్ లిన్, రెడ్డిట్ సిఇఒ హఫ్ఫ్మన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
undefined
click me!