ఒక్కసారి చార్జ్ చేస్తే 48రోజుల బ్యాకప్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. ప్రపంచంలోనే మొట్టమొదటి హై-ఎండ్ బ్యాటరీతో..

First Published | Aug 25, 2021, 1:24 PM IST

మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ ఎక్కువసేపు  ఉండట్లేదని భాధపడుతున్నారా.. మొబైల్ ఛార్జింగ్ తో సమస్యగా ఉందా..  ఫోన్ ఛార్జింగ్ తక్కువ బ్యాకప్ ఉందని చింతిస్తున్నారా..  వీటన్నికి చెక్ పెడుతూ ఊకిటెల్ డబల్యూ‌పి15 5జి అనే స్మార్ట్‌ఫోన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది, దీని హైలెట్ ఫీచర్ ఏంటంటే దీనిలో అత్యంత భారీ  15600mAh బ్యాటరీ అందించారు ఇంకా ఈ ఫోన్ డిజైన్ కూడా కఠినమైనది. 

ఊకిటెల్ WP15 5జి బ్యాటరీ 130 గంటల కాలింగ్‌  బ్యాకప్, స్టాండ్‌బై సమయం 1,300 గంటలు ఉంటుందని తెలిపింది. ఫోన్ డిజైన్ కార్బన్ ఫైబర్ టేక్శ్చర్ దీనికి ఐ‌పి68 రేటింగ్ లభించింది అంటే ఈ ఫోన్ 1.5 మీటర్ల నీటి  లోతు 30 నిమిషాలు ఉండగలదు.  అధిక ప్రేజర్, టెంపరేచర్ కోసం ఐ‌పి69కే రేటింగ్‌  పొందింది.

ఊకిటెల్ WP15 5జి ధర, లభ్యత

ఊకిటెల్ WP15 5జి 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 299.99 డాలర్లు అంటే సుమారు రూ. 22,200. ఫోన్ సింగిల్ క్లాసిక్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఈ ఫోన్ ను అలీ ఎక్స్ప్రెస్  నుండి కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ 100 మంది కస్టమర్‌లు ఫోన్‌తో ఊకిటెల్ వి10 స్మార్ట్ వాచ్‌ను ఉచితంగా పొందవచ్చు, అలాగే 101 నుండి 600 వరకు కస్టమర్‌లు ఇయర్‌బడ్‌లను ఉచితంగా పొందుతారు.

ఊకిటెల్ WP15 5జి స్పెసిఫికేషన్లు 
 ఊకిటెల్ WP15 5జిలో అండ్రాయిడ్ 11, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, డిస్ ప్లే  బ్రైట్ నెస్ 400 నిట్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 8 జి‌బి RAM మరియు 128జి‌బి దీనిని మెమరీ కార్డ్ సహాయంతో 256జి‌బి వరకు పెంచుకోవచ్చు.

Latest Videos


ఊకిటెల్ WP15 5జి కెమెరా

కెమెరా గురించి మాట్లాడితే ఊకిటెల్ WP15 5జిలో  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.8. రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో, మూడవ లెన్స్ 0.3-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎపర్చరు f/2.0 లభిస్తుంది.

ఊకిటెల్ WP15 5జి బ్యాటరీ
ఈ మొబైల్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 15600mAh బ్యాటరీ అందించారు. ఫోన్‌ను ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనికి రివర్స్ ఛార్జింగ్  సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం యూ‌ఎస్‌బి టైప్-సి, బ్లూటూత్ వి5.1, వై-ఫై 802.11ac, డ్యూయల్ 5జి, వై-ఫై డైరెక్ట్, ఎన్‌ఎఫ్‌సిలకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 485 గ్రాములు.

click me!