ఈ యాప్ మార్చి 2020లో ప్రారంభించారు. కూలో ఇప్పటివరకు 6 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ కొత్త లోగో ప్రారంభంలో మాట్లాడుతూ “కూ యాప్ దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రజలను కలుపుతోంది. ఈ రోజు నేను కూ యాప్ కొత్త లోగోను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప సోషల్ మీడియా యాప్‌ను సృష్టించిన బృందానికి నా అభినందనలు. ” అని అన్నారు.
undefined
కూ సహ వ్యవస్థాపకుడు అమేమియా రాధాకృష్ణ మాట్లాడుతూ, "మా కొత్త లోగోని మీ ముందుకు తీసుకువచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది మా చిన్న పసుపు పక్షి బాల్యం నుండి కౌమారదశలో పెరిగే సంకేతం. ఈ పక్షి జీవితంలోని వివిధ కోణాల గురించి మాట్లాడటానికి, చర్చించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. ఈ చిన్న పక్షి ఎగరడానికి సిద్ధంగా ఉంది. తన 65వ పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా కూ కొత్త లోగోను ప్రారంభించినందుకు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కు కృతజ్ఞతలు. " అని అన్నారు.
undefined
స్థానిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కూ ఇటీవల టాక్ టు టైప్ ఫీచర్‌ను ప్రారంభించింది. టాక్ టు టైప్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు వారి భాషలో మాట్లాడవచ్చు, టైప్ చేయవచ్చు. కూ టాక్ టు టైప్ ఫీచర్ వాయిస్ టైపింగ్‌కు చాలా పోలి ఉంటుంది, అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి చాలా భారతీయ భాషలలో సపోర్ట్ ఉంది.
undefined