సిమ్ కార్డు సపోర్ట్ తో శాంసంగ్‌ సరికొత్త టాబ్లెట్.. మొబైల్ ఫోన్ కన్నా అతి తక్కువ ధరకే లాంచ్..

First Published Jun 19, 2021, 7:15 PM IST

సౌత్ కొరియాకు  దిగ్గజం శాంసంగ్‌  రెండు కొత్త టాబ్లెట్లను భారతదేశంలో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్ఇ, గెలాక్సీ టాబ్ ఎ7లైట్ ఉన్నాయి. ఈ రెండు ట్యాబ్‌లను గత నెల ఐరోపాలో  లాంచ్ చేశారు. ఎఫ్ఇ వెర్షన్ టాబ్  ఎఫ్ఇ వెర్షన్ ఫోన్  లాగానే ఉంటుంది. వీటిలో శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7లైట్ చౌకైన టాబ్లెట్. 
 

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్‌ఇశామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్‌ఇ ధర రూ .46,999. ఈ ధర వద్ద 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. అలాగే 6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ ధర రూ .50,999. ఈ ట్యాబ్‌ను మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్, మిస్టిక్ సిల్వర్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్ కింద గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్‌ఇ పై హెచ్‌డిఎఫ్‌సి కార్డులపై రూ .4 వేల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే కీబోర్డ్ కవర్‌పై రూ .10,000 తగ్గింపు ఇస్తుంది.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7లైట్ ధరసామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7లైట్ ఎల్‌టిఇ వేరియంట్‌తో కూడిన 3జిబి ర్యామ్ తో 32 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999. వై-ఫై మోడల్ ధర రూ .11,999. ఈ ట్యాబ్‌ను బూడిద రంగు, వెండి రంగులో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ట్యాబ్‌లను జూన్ 23 నుండి విక్రయించనున్నారు.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఏ7 లైట్ ఫీచర్లుశామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7లైట్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ కోర్ 3.1, 1340x800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 8.7-అంగుళాల డబల్యూ‌ఎక్స్‌జి‌ఏ ప్లస్ డిస్ ప్లే, ఆక్టా-కోర్ ప్రాసెసర్, మీడియాటెక్ హెలియో పి22టి (ఎమ్‌టి 8786 టి) అందించారు. ఈ టాబ్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి5, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వస్తుంది. 51WmAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్‌ఈ ఫీచర్స్గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్‌ఇలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1, 2560x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 12.4-అంగుళాల డబల్యూక్యూ‌ఎక్స్‌జి‌ఏ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్‌, 6 జిబి ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్‌ లభిస్తుంది. దీనిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి5, జిపిఎస్, యుఎస్‌బి టైప్ సి పోర్ట్ లభిస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ తో ఎకెజి పవర్డ్ స్టీరియో స్పీకర్లను అందించింది. దీనితో ఎస్ పెన్ స్టైలస్‌ సపోర్ట్ కూడా ఉంది. ఈ టాబ్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ 10090 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
undefined
undefined
click me!