మోటరోలా డిఫై ఫోన్ డ్యూయల్ సీల్డ్ హౌసింగ్‌తో వస్తుంది అంటే ఈ ఫోన్ 5 అడుగుల లోతైన నీటిలో పడిన కూడా 35 నిమిషాల పాటు ఉండగలదని మోటరోలా తెలిపింది. అంతేకాకుండా ఇసుక, దుమ్ము, ఉప్పు, తేమ కూడా ఈ ఫోన్‌కి హాని కలిగించవు. మోటరోలా డిఫై వైబ్రేషన్, డ్రాప్ టెస్టింగ్ కూడా చేయబడింది. 6 అడుగుల నుండి కింద పడిపోయిన తర్వాత కూడా ఈ ఫోన్ చెడిపోదు. మీరు ఈ ఫోన్‌ని సబ్బు లేదా తేలికపాటి క్రిమిసంహారక మందులతో కూడా కడగవచ్చు.
undefined
మోటరోలా డిఫై ధర, లభ్యతమోటరోలా డిఫై ధర 329 యూరోలు అంటే సుమారు రూ .29,000. 4 జీబీ ర్యామ్ తో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే విక్రయించనున్నారు. దీన్ని బ్లాక్ అండ్ ఫోర్జెడ్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌తో రెండేళ్ల వారంటీ, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. అయితే భారతదేశంలో ఈ ఫోన్ లభ్యత గురించి కంపెనీ సమాచారం వెల్లడించలేదు.
undefined
మోటరోలా డిఫైలో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ అందించారు. దీనికి త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ కూడా లభిస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వస్తుంది. అయితే మెమరీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ మరింత పెంచుకోవచ్చు.
undefined
మోటరోలా డిఫై కెమెరాఈ మోటరోలా ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు f1.8, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
undefined
మోటరోలా డిఫై బ్యాటరీఈ ఫోన్ 20W టర్బోపవర్ ఛార్జీకి సపోర్ట్ ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. బ్యాటరీకి సంబంధించి 2 రోజుల బ్యాకప్ ఇస్తుందని తెలిపింది. కనెక్టివిటీ కోసం దీనికి యుఎస్‌బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ వి5, ఎన్‌ఎఫ్‌సి, వోఎల్‌టిఇ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
undefined