Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!

Published : May 04, 2026, 03:32 PM IST

Mobile Phone Safety: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా జీవితం ఊహించుకోవడం కష్టమే. ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ చేతిలో ఉండాల్సిందే. అయితే చాలామంది ఫోన్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. కానీ కొన్ని ప్లేసుల్లో ఫోన్ ని అస్సలు పెట్టకూడదట. ఎక్కడో చూద్దాం.

PREV
16
ఫోన్ ని పొరపాటున కూడా పెట్టకూడని ప్లేసులు

మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ మనతోనే ఉంటుంది. అయితే చాలా మంది తెలియకుండానే ఫోన్‌ను రాంగ్ ప్లేస్ లో పెడుతుంటారు. దానివల్ల ఫోన్ పనితీరు, బ్యాటరీ లైఫ్‌, ఇంకా మన ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుంది అంటున్నారు నిపుణులు. ఫోన్ ని ఎక్కడ పెట్టకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
సూర్యరశ్మి నేరుగా పడే చోట

డైరెక్ట్ సూర్యరశ్మిలో ఫోన్ పెట్టడం చాలా పెద్ద తప్పు. ఎండలో, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఫోన్‌ను ఉంచితే అది వేడెక్కి ఓవర్‌హీట్ అవుతుంది. దానివల్ల బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవ్వడం లేదా పనితీరు తగ్గిపోవడం కూడా జరుగుతుంది.

అదే విధంగా కార్ డ్యాష్‌బోర్డ్ లో ఫోన్ పెట్టడం కూడా చాలా ప్రమాదకరం. కార్ లోపల ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది, అందువల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.

36
ప్యాంట్ పాకెట్ లో..

చాలామంది బాయ్స్ ప్యాంట్ పాకెట్‌లో ఫోన్ పెట్టుకుని తిరుగుతుంటారు. ఇది సౌకర్యంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పాకెట్‌లో ఎక్కువసేపు ఫోన్ ఉంచడం వల్ల శరీరంపై హీట్ ప్రభావం, రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే కూర్చునేటప్పుడు ఫోన్‌పై ఒత్తిడి పడటం వల్ల స్క్రీన్ లేదా ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

46
పిల్లో కింద వద్దు

రాత్రి నిద్రపోతున్నప్పుడు ఫోన్‌ని చాలామంది పిల్లో కింద పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫోన్ హీట్‌ను విడుదల చేస్తుంది. పిల్లో కింద ఉంచితే ఆ హీట్ బయటకు వెళ్లకుండా ఆగిపోతుంది. దానివల్ల ఫోన్ వేడెక్కి డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో పేలే ప్రమాదం కూడా ఉంటుంది.

56
గ్యాస్ స్టవ్ పక్కన వద్దు

గ్యాస్ స్టవ్ పక్కన ఫోన్ పెట్టడం కూడా ప్రమాదకరం. వంట చేసేటప్పుడు వేడి, ఆవిరి, ఆయిల్ స్ప్లాష్ వంటివి ఫోన్‌పై ప్రభావం చూపుతాయి. అధిక వేడి వల్ల బ్యాటరీ, స్క్రీన్ దెబ్బతినే అవకాశం ఉంది.

అలాగే బాత్రూమ్‌ కి ఫోన్ తీసుకెళ్లడం కూడా చాలా రిస్క్. ఫోన్ పై బ్యాక్టీరియా చేరవచ్చు. అలాగే నీటి ఆవిరి, తేమ ఫోన్ లోపలికి చేరి సర్క్యూట్స్‌ను డ్యామేజ్ చేయవచ్చు. ఇది వెంటనే కనిపించకపోయినా, కొంతకాలానికి ఫోన్ స్లో కావడం లేదా అకస్మాత్తుగా పనిచేయకపోవడం వంటివి జరుగుతాయి.

66
ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం

అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. ఎక్కువసేపు ఫోన్‌ను చెవిదగ్గర పెట్టుకుని మాట్లాడటం. ఇది సాధారణంగా కనిపించినా, దీర్ఘకాలంలో చెవులు, మెదడుపై హీట్, రేడియేషన్ ప్రభావం పెరగవచ్చు. అందుకే ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు ఇయర్‌ఫోన్స్ లేదా స్పీకర్ మోడ్ ఉపయోగించడం మంచిది. ఇది కేవలం ఫోన్‌ను మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories