Submarine Cables: ఇంటర్నెట్ ఉపగ్రహాల ఆధారంగా పనిచేస్తుందని తెలిసిందే. అయితే ప్రపంచంలో దాదాపు 95% నుంచి 99% వరకు ఇంటర్నెట్ ట్రాఫిక్ సముద్రం అడుగున వేసిన సబ్‌మరైన్ కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తుందని తెలుసా.? ఇంతకీ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే.
భూమిపై కేబుల్స్ వేయడం కంటే సముద్రం అడుగు భాగం చాలా స్థిరంగా ఉంటుంది. భూమిపై నిర్మాణ పనులు, తవ్వకాలు, వాహనాలు వంటి కారణాలతో కేబుల్స్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సముద్రం లోపల అలాంటి ఆటంకాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే కేబుల్స్ సురక్షితంగా ఉండటానికి సముద్రం మంచి ఎంపికగా భావిస్తారు.
25
ఖండాలను కలపడానికి ఇదే సరైన మార్గం
ప్రపంచంలోని ఖండాలు చాలా దూరంగా ఉంటాయి. ఈ దూరాన్ని భూమి మీదుగా కవర్ చేయడం కష్టం, ఖరీదైన పని కూడా. సముద్రం అడుగున కేబుల్స్ వేయడం ద్వారా నేరుగా ఒక దేశం నుంచి మరో దేశానికి కనెక్ట్ అవ్వచ్చు. ఇది చిన్నదైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ఉంటుంది.
35
సబ్‌మరైన్ కేబుల్స్ ఎలా పని చేస్తాయి?
ఈ కేబుల్స్ సాధారణ తాడులు కావు. వీటిలో ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ఉంటుంది. అంటే లోపల గాజుతో తయారైన పలుచని ఫైబర్ తీగలు ఉంటాయి. ఇవి లైట్ సిగ్నల్స్ రూపంలో డేటాను చాలా వేగంగా పంపిస్తాయి. ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి వేగంగా పని చేస్తాయి, ఆలస్యం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఇంటర్నెట్ స్పీడ్ మెరుగ్గా ఉంటుంది.
సముద్రంలో నీరు ఎక్కువగా ఉన్నా, ఈ కేబుల్స్ ప్రత్యేక రక్షణతో తయారు చేస్తారు. కేబుల్ లోపల గాజు ఫైబర్ ఉంటే, బయట పలుచోట్ల రక్షణ పొరలు ఉంటాయి. స్టీల్, కాపర్ వంటి పదార్థాలతో వాటిని కవర్ చేస్తారు. అదనంగా నీరు లోపలికి రాకుండా ప్రత్యేక జెల్ కోటింగ్ వేస్తారు. బయట ప్లాస్టిక్ పొర ఉండటం వల్ల ఉప్పు నీటితో వచ్చే తుప్పు నుంచి కూడా రక్షణ ఉంటుంది.
55
సముద్ర గర్భంలో ఒత్తిడిని ఎలా తట్టుకుంటాయి?
సముద్రం లోతుల్లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కేబుల్స్ ఆ ఒత్తిడిని తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. బలమైన మెటల్ పొరలు, హెవీ కోటింగ్ వల్ల అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ సురక్షితంగా పని చేస్తాయి. అందుకే వేల కిలోమీటర్ల దూరం వరకు డేటా సాఫీగా ప్రయాణిస్తుంది.