ఇలాంటి సందర్భలలో ఫోటోలను క్లిక్ చేయడానికి లేదా వీడియో తీయడానికి మీరు కెమెరాను ఆన్ చేసినప్పుడు ఫోన్‌లో లో స్టోరేజ్ వార్నింగ్ చూపిస్తుంటుంది. స్టోరేజ్ ఫుల్ కారణంగా ఫోటోలు క్లిక్ చేయకుండా వీలుండదు. తక్కువ స్టోరేజ్ ఒక్కోసారి మీరు కొన్ని ముఖ్యమైన ఫైళ్ళను కూడా డౌన్‌లోడ్ చేయలేరు. ఫోన్‌లో ర్యామ్ ఇంకా స్టోరేజ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయయి. మీరు మీ ఫోన్ స్టోరేజ్ ను పెంచుకునేందుకు కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి...
undefined
స్మార్ట్ ఫోన్ లో స్టోరేజ్ సమస్యను తగ్గించడానికి మొదట అనవసరమైన యాప్స్ డిలెట్ చేయండి దీని ద్వారా కొంత స్టోరేజ్ పెంచుకొవచ్చు. మీకు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉంటే ఫోటోలు లేదా వీడియొలను అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మీరు వెంటనే మీ ఫోన్‌లోని స్టోరేజ్ పెంచుకోవాలంటే మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్స్ ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటున్నాయో చెక్ చేయండి. మీకు అనవసరమైన యాప్స్ కనిపిస్తే మీరు మొదట ఆ యాప్స్ డిలెట్ చేయండి. ఇది చాలా వరకు స్టోరేజ్ సమస్యను తగ్గిస్తుంది.
undefined
అనవసరమైన ఫోటోలు, వీడియోలను డిలెట్ చేయండియాప్స్ డిలెట్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్ తక్కువగా ఉంటే ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటోలు, వీడియోలను ఒకసారి చెక్ చేయండి. ఒకోసారి ఫోన్ చాలా పాత మెసేజులు, అనవసరమైన ఫోటోలతో నిండి ఉంటుంది, వీటిని కూడా డిలెట్ చేయవచ్చు. దీనితో పాటు వాట్సాప్‌లో అనవసరమైన ఫోటోలు, వీడియోలను కూడా తొలగించండి. ఫోన్‌లో తగినంత స్టోరేజ్ కోసం వాట్సాప్ నుండి ఫార్వార్డ్ చేసిన వీడియోలు, ఫోటోలను వెంట వెంటనే డిలెట్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం కూడా ఫోన్‌లో స్టోరేజ్ సమస్యను తగ్గిస్తుంది.
undefined
అట్చడ్ ఫైల్‌లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయిచాలాసార్లు ఈ-మెయిల్‌తో అటాచ్ చేసిన ఫైల్‌లను డౌన్‌లోడ్ చేస్తాము. అవి ఫోన్‌లోనే సేవ్ అవుతుంటాయి. ఈ అవసరం లేని ఫైల్‌లు ఫోన్‌లో చాలా స్టోరేజ్ తీసుకుంటాయి, ఇంకా ఫోన్ స్టోరేజ్ ను తగ్గిస్తుంది. మీరు ఈ అనవసరమైన అటాచ్ చేసిన ఫైళ్ళను కూడా డిలెట్ చేయవచ్చు.
undefined
ట్రాష్ క్లియర్ చేయండిఫోన్‌లో స్టోరేజ్ పెంచడానికి మీరు ట్రాష్ లేదా రీసైకిల్ బిన్ ని క్లియర్ చేస్తూ ఉండాలి. మీకు అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే మీరు సెట్టింగ్‌లకు వెళ్లి ట్రాష్ క్లియర్ చేయవచ్చు. ట్రాష్ క్లియర్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కొంతవరకు పెరుగుతుంది.
undefined
ఐఫోన్ యూజర్లుమీరు ఐఫోన్ వినియోగదారులు అయితే సెటింగ్స్ లో జనరల్ పై క్లిక్ చేస్తే అప్పుడు స్టోరేజ్ అండ్ ఐక్లౌడ్ స్టోరేజ్ చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఇప్పుడు మెయిన్ స్టోరేజ్ ఆప్షన్ కి వెళ్ళండి. ఇక్కడ ఫోన్ స్టోరేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఉపయోగపడని ఫైల్‌లను డిలెట్ చేయవచ్చు.
undefined
క్లౌడ్ స్టోరేజ్ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా తక్కువ స్టోరేజ్ ఉందని భావిస్తే మీరు క్లౌడ్ స్టోరేజ్ సేవను ఉపయోగించవచ్చు. ఇక్కడ ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లను క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేయవచ్చు. ఏదైనా ముఖ్యమైన ఫైళ్ళను సురక్షితంగా ఉంచడానికి క్లౌడ్ స్టోరేజ్ సేవ బెస్ట్ ఆప్షన్.
undefined