ఈ రెండు ఫోన్‌ల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. వీటిలో ఒకటి 5జి ఫోన్, మరొకటి 4జి కనెక్టివిటీతో వస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించగ, గెలాక్సీ ఎ22లో నాలుగు వెనుక కెమెరాలతో లాంచ్ చేశారు.
undefined
శామ్సంగ్ గెలాక్సీ ఎ22 5జి, శామ్సంగ్ గెలాక్సీ ఎ22 ధరశామ్సంగ్ గెలాక్సీ ఎ22 5జి ప్రారంభ ధర 229 యూరోలు, అంటే సుమారు 20,300 రూపాయలు. ఈ ధర వద్ద 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉండగా, 4 జిబి ర్యామ్‌తో 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 249 యూరోలు, అంటే సుమారు రూ .22,100. ఫోన్ లో మరో రెండు మోడల్స్ కూడా ఉన్నాయి, వీటిలో 6 జిబి ర్యాంమ్, 8 జిబి ర్యామ్ ఇచ్చారు. అయితే వాటి ధరను కంపెనీ వెల్లడించలేదు.
undefined
శామ్సంగ్ గెలాక్సీ ఎ22ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. వీటిలో 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఇంకా 4 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ అలాగే 6 జిబి ర్యామ్,128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌ను బ్లాక్, మింట్, వైలెట్, వైట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.శామ్సంగ్ గెలాక్సీ ఎ22 5జి ఫీచర్లుశామ్సంగ్ గెలాక్సీ ఎ22 5జి 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. దీనిలో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇచ్చారు, కానీ చాలా నివేదికలలో ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 70 అని సూచించింది. ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంది.
undefined
కెమెరా చూస్తే శామ్సంగ్ గెలాక్సీ ఎ22 5జిలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. ముందు వైపు, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫి కెమెరా ఇచ్చారు. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 5జి, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ఇచ్చారు. దీనిలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అలాగే 15W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
undefined
శామ్సంగ్ గెలాక్సీ ఎ22 4జి ఫీచర్లుశామ్సంగ్ గెలాక్సీ ఎ22 6.4-అంగుళాల హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ హెలియో జి80 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్ తో 128 జిబి వరకు స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, వాటిలో మొదటిది 48 మెగాపిక్సెల్స్, రెండవది 8 మెగాపిక్సెల్స్, మూడవది 2 మెగాపిక్సెల్స్, నాల్గవది 2 మెగాపిక్సెల్స్.13 మెగాపిక్సెల్ కెమెరా ముందు భాగంలో ఇచ్చారు. కనెక్టివిటీ కోసం ఎల్‌టిఈ, వై-ఫై, బ్లూటూత్ జిపిఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇంకా 15Wఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
undefined