జాన్ మకాఫీ బార్సిలోనా సమీపంలోని జైలులో ఆత్మహత్య చేసుకున్నాట్లు సమాచారం. ప్రాంతీయ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో మెకాఫీని కాపాడటానికి జైలు సిబ్బంది తమ వంతు కృషి చేశారని తెలిపింది. జైలు వైద్య బృందం మరణాన్ని కూడా ధృవీకరించింది. ఈ ప్రకటనలో జాన్ మెకాఫీ పేరు లేకపోయినప్పటికీ అతను 75 ఏళ్ల యుఎస్ పౌరుడు, అయితే మరణించిన వ్యక్తి మరెవరో కాదని జాన్ మెకాఫీ అని ప్రభుత్వ వర్గాలు బుధవారం ధృవీకరించాయి.
జాన్ మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి. అయితే గతంలో అతనిపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. 2014 నుండి 2018 మధ్య పన్నులు చెల్లించలేదని మెకాఫీపై ఆరోపణలు ఉన్నాయి. అతను క్రిప్టో కరెన్సీ నుండి లక్షలు సంపాదించాడు ఇంకా తన జీవిత కథ హక్కులను విక్రయించాడు, అప్పుడు కూడా అతను ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఈ నేరం రుజువైతే అతనికి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
జీవితాంతం జైలులోజాన్ మెకాఫీని అమెరికాకు అప్పగించడానికి అనుకూలంగా స్పెయిన్ జాతీయ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో తన అభ్యర్ధనలో జాన్ మెకాఫీ తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించబడిందని, అతన్ని అమెరికాకు అప్పగిస్తే జీవితాంతం జైలు జీవితం అనుభవిస్తానని వాదించాడు. అతనిని అమెరికాకు అప్పగించడానికి కోర్టు ఉత్తర్వులను బుధవారం బహిరంగపరిచారు. అయితే దీనికి వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికి తుది ఉత్తర్వులకు స్పానిష్ క్యాబినెట్ ఆమోదం అవసరం.
గత ఏడాది అరెస్ట్జాన్ మకాఫీని బార్సిలోనా విమానాశ్రయంలో అక్టోబర్ 2020లో అరెస్టు చేశారు. బ్రిటిష్ పాస్‌పోర్ట్‌తో బార్సిలోనా విమానాశ్రయంలో ఇస్తాంబుల్‌కు విమానంలో వెళుతుండగా అతని అరెస్టు జరిగింది.
నాసాతో సహా కొన్ని సంస్థలతో కలిసి1987లో ప్రపంచంలో మొట్టమొదటి బిజినెస్ యాంటీవైరస్ ని ప్రారంభించడానికి ముందు జాన్ మకాఫీ నాసా, జిరాక్స్, లాక్హీడ్ మార్టిన్ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. అతను తన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఇంటెల్‌కు 2011 సంవత్సరంలో విక్రయించాడు. అయినప్పటికీ అతని పేరు ఇప్పటికీ సాఫ్ట్‌వేర్‌తో ముడిపడి ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.