మెగాపిక్సెల్ అంటే ఏంటి.? ఇది ఫొటో క్లారిటీని ఎలా డిసైడ్ చేస్తుందో తెలుసా..

Published : Oct 31, 2025, 08:51 AM IST

Megapixel: స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు చాలా మంది చూసే అంశాల్లో కెమెరా ఒక‌టి. మెగాపిక్సెల్ ఆధారంగా కెమెరా క్లారిటీని అంచ‌నా వేస్తార‌ని తెలిసిందే. అయితే ఇంత‌కీ ఏంటీ మెగాపిక్సెల్, దీనిని ఎలా నిర్ణ‌యిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మెగాపిక్సెల్ అంటే ఏంటి.?

"మెగాపిక్సెల్" అంటే 10 లక్షల పిక్సెల్స్‌ అని అర్థం. పిక్సెల్ అంటే ఒక చిన్న రంగు చుక్క (color dot). ఇవన్నీ కలిసే ఒక డిజిటల్ ఫోటోగా ఏర్పడుతుంది. మీరు ఫోటో తీస్తే, కెమెరా లక్షల కొద్దీ పిక్సెల్స్‌ను క్యాప్చర్‌ చేసి ఒక గ్రిడ్‌లా అమర్చి ఫోటోను తయారు చేస్తుంది. అందుకే మీరు ఫోటోను ఎక్కువగా జూమ్ చేస్తే చిన్న చిన్న చతురస్రాల (స్క్వేర్‌ల) మాదిరిగా కనిపిస్తాయి. అవే పిక్సెల్స్‌.

25
ఎక్కువ మెగాపిక్సెల్స్‌ అంటే మంచి ఫోటోనా?

చాలామందికి ఎక్కువ మెగాపిక్సెల్స్‌ ఉంటే ఫోటో క్వాలిటీ మెరుగ్గా వస్తుందని భావం ఉంటుంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మెగాపిక్సెల్స్‌ సంఖ్య ఎక్కువైతే ఫోటోలో డీటెయిల్‌ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఫోటోను పెద్దగా ప్రింట్‌ చేయాలనుకున్నప్పుడు లేదా క్రాప్‌ చేయాలనుకున్నప్పుడు సహాయపడుతుంది. కానీ మంచి ఇమేజ్‌ క్వాలిటీకి కేవలం మెగాపిక్సెల్‌ మాత్రమే కాదు.. లెన్స్‌ క్వాలిటీ, సెన్సార్‌ సైజ్‌, లైటింగ్‌, కెమెరా సాఫ్ట్‌వేర్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

35
మంచి ఫోటోకు ప్రభావం చూపే అంశాలు

ఫోటో స్పష్టంగా, సహజంగా రావడానికి ఈ అంశాలు కలిసి పనిచేస్తాయి:

* లెన్స్‌ నాణ్యత: లైట్‌ను ఎంత బాగా ఫోకస్‌ చేస్తుందో దానిపై ఆధారపడి ఫోటో క్వాలిటీ ఉంటుంది.

* సెన్సార్‌ సైజ్‌: పెద్ద సెన్సార్‌ ఎక్కువ లైట్‌ క్యాప్చర్‌ చేయగలదు, ఫలితంగా మంచి డీటెయిల్స్‌ వస్తాయి.

* లైటింగ్‌ పరిస్థితులు: సహజ కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫోటోలు కాస్తా స్పష్టంగా వస్తాయి.

* కెమెరా సాఫ్ట్‌వేర్‌ ప్రాసెసింగ్‌: ఫోటో తీసిన తర్వాత దాన్ని ప్రాసెస్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

45
ఎక్కువ మెగాపిక్సెల్స్‌ ఎప్పుడు అవసరం?

మీరు తీసిన ఫోటోను పెద్ద సైజులో ప్రింట్‌ చేయాలనుకున్నప్పుడు, లేదా క్రాప్‌ చేసి చిన్న భాగాన్ని మాత్రమే ఉపయోగించాలనుకున్నప్పుడు ఎక్కువ మెగాపిక్సెల్స్‌ అవసరం అవుతాయి. అందుకే ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ, ప్రోడక్ట్‌ షూట్స్‌, ప్రకటనల ఫోటోలకు ఎక్కువ మెగాపిక్సెల్స్‌ ఉన్న కెమెరాలు వాడుతారు.

55
సింపుల్‌గా చెప్పాలంటే..

ఎక్కువ మెగాపిక్సెల్స్‌ అంటే ఎప్పుడూ మంచి ఫోటో అని కాదు. మంచి లెన్స్‌, సెన్సార్‌, కాంతి, సాఫ్ట్‌వేర్‌ – ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే బెస్ట్‌ ఫోటో వస్తుంది. సాధారణ వినియోగదారులకు 12–24 మెగాపిక్సెల్స్‌ కెమెరా సరిపోతుంది. ఎక్కువ మెగాపిక్సెల్స్‌ అవసరం కేవలం ప్రొఫెషనల్‌ ఫోటోగ్రఫీకి మాత్రమే.

Read more Photos on
click me!

Recommended Stories