10వేలకే 5జి స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా..? గెట్ రెడీ, ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ పై గొప్ప డీల్స్ ఇవే !

First Published | Oct 5, 2023, 4:25 PM IST

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పోకో  మొబైల్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్స్ అందిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో బిగ్ బిలియన్ డేస్ డిస్కౌంట్ సేల్ అక్టోబర్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ సేల్ రోజుల్లో పోకో మొబైల్ ఫోన్స్ పై స్పెషల్  ఆఫర్స్  తీసుకొచ్చారు...

పోకో M5, పోకో M4 5G, పోకో M6 ప్రో  5G స్మార్ట్‌ఫోన్‌లపై  ఈ ఆఫర్స్  ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.  ఇప్పుడు పోకో X5 ప్రో  5G, పోకో F5, పోకో C55, పోకో  F5, పోకో C50లపై  కూడా ఆఫర్ ప్రకటించింది.
 

POCO M6 5G Smart Phone

పోకో M5
పోకో M5లో 6GB  ర్యామ్, 128GB స్టోరేజ్  ఉంది. Mediatek Helio G9 ప్రాసెసర్‌తో  6.58-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే,  కెమెరా విషయానికొస్తే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీతో మూడు కెమెరాలు (50MP + 2MP + 2MP) ఉన్నాయి. 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌తో రోజంతా ఉంటుంది.

బ్లాక్, గ్రీన్ అండ్ ఎల్లో అనే  3 కలర్ అప్షన్స్ లో అందుబాటులో ఉంది. మూడు RAM అండ్ స్టోరేజ్ వేరియంట్‌లు కూడా  ఉన్నాయి: 4GB + 64GB, 4GB + 128GB, 6GB + 128GB. రూ.8,499తో లాంచ్ అయిన Poco M5 మొబైల్ ఇప్పుడు రూ.6,999 ధరకే  లభిస్తున్నాయి.
 


పోకో M4 5G

Poco M4 Mediatek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా డ్యూయల్ కెమెరా (13MP + 2MP), 5MP సెల్ఫీ కెమెరా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌పై రోజంతా 
 ఉంటుంది.

ఈ ఫోన్ కూడా బ్లాక్, బ్లూ అండ్ ఎల్లో అనే మూడు కలర్స్  అండ్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది - 4GB + 64GB ఇంకా 6GB + 128GB. Poco M4 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 9,999కి అమ్మకానికి ఉంది.
 

Poco M6 Pro 5G

Poco M6 Pro 5G మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 6.79 అంగుళాల FHD+ డిస్ప్లే, AI టెక్నాలజీతో   50MP + 2MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం 8MP కెమెరా అందించారు. 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

Poco M6 Pro 5G మొబైల్ రెండు కలర్స్ లో లభిస్తుంది - బ్లాక్ ఆండ్ గ్రీన్.  6GB + 128GB అలాగే 8GB + 128GB వేరియంట్‌లలో వస్తుంది. ఇప్పుడు వీటి ధర రూ.8,999నుండి ఉంటుంది.

Latest Videos

click me!