ఇక నుంచి రాత్రంతా ఫ్రీ.. అన్ లిమిటెడ్ డేటా ఆఫర్.. వీరికి మాత్రమే ?

First Published | Oct 5, 2023, 11:56 AM IST

బడ్జెట్ ధరలతో ఎన్నో  ప్లాన్‌లను అందిస్తున్న కంపెనీల మధ్య భారత టెలికాం మార్కెట్ తీవ్ర పోటీనిస్తోంది. ఎక్కువ కస్టమర్లను  చేరుకునేందుకు అన్ని కంపెనీలు వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు Vi (వోడాఫోన్ ఐడియా)  మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యూజర్స్ కోసం ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఇప్పుడు ఈ వినియోగదారులు ఆన్ లిమిటెడ్ డేటా అండ్  డేటా షేరింగ్   బెనిఫిట్స్ పొందుతారు.
 

కంపెనీ గత ఏడాది నవంబర్‌లో Vi Max ప్లాన్‌లను ప్రారంభించింది. వీటి ధర రూ.601 నుండి  రూ.1151గా ఉంటుంది. ఈ ప్లాన్‌లతో వినియోగదారులు మరో నలుగురు ఫ్యామిలీ  మెంబర్స్ తో డేటా ఇంకా  కాలింగ్ ప్రయోజనాలను ఎక్స్టెండ్  చేయవచ్చు. అయితే  డేటా అయిపోకపోతే  ఇతరులతో కూడా  షేర్ చేసుకునే అప్షన్ కూడా ఉంది.  10GB నుండి 25GB వరకు అదనపు డేటాను షేర్ చేసుకోవచ్చు.
 

Vodafone Idea ఇప్పుడు Vi Max ప్లాన్‌లతో ఆన్ లిమిటెడ్ ఓవర్‌నైట్ డేటాను అందించనుంది. అంటే వినియోగదారులు అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు ఆన్ లిమిటెడ్  డేటా లభిస్తుంది. మొబైల్ డేటాపై ఎలాంటి ప్రభావం లేకుండా   తమకు నచ్చిన హై-డెఫినిషన్ కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ టైంలో డేటాను ఉపయోగించడం పూర్తిగా ఉచితం.
 


మీరు Vi  ప్రీపెయిడ్ సర్వీస్  ఉపయోగిస్తున్నట్లయితే మీరు కొన్ని  ప్లాన్‌లతో ఆన్ లిమిటెడ్ ఓవర్ నైట్ డేటా బెనిఫిట్స్ పొందుతారు. Vi Hero అన్‌లిమిటెడ్‌లో  ప్లాన్‌ల నుండి రీఛార్జ్ చేసుకుంటే ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు రాత్రిపూట ఆన్ లిమిటెడ్ డేటాకు యాక్సెస్ పొందుతారు. ఇలా చేసే యూజర్లకు వాడని డైలీ డేటా వీకెండ్ లో  వాడుకునే అవకాశం కూడా ఇచ్చారు.
 

 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో  వినియోగదారులకు ఆన్ లిమిటెడ్ డేటా బెనిఫిట్స్  అందించే ఏకైక టెల్కో Vi. అంతే కాకుండా, చాల  ప్రీపెయిడ్ ప్లాన్‌లు డేటా రోల్‌ఓవర్ బెనెఫోట్స్ కూడా అందిస్తాయి. అంటే, వినియోగదారులు ఉపయోగించని డైలీ డేటా   వీకెండ్లో పొందుతారు.
 

Latest Videos

click me!