స్మార్ట్ ఫోన్ లవర్స్ కి షాకింగ్ న్యూస్.. త్వరలో నిలిచిపోనున్న మొబైల్స్ ఉత్పత్తి...

First Published Mar 23, 2021, 10:55 AM IST

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్‌జి  మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని త్వరలో  పూర్తిగా మూసివేయాలని కంపెనీ భావిస్తోందట.  ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలకు సంబంధించిన వ్యూహాలు  సఫలం కాకపోవడం వ్యాపార భాగస్వామ్య చర్చలు కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణమని అంచనా.   
 

స్మార్ట్ ఫోన్ వ్యాపారం సేల్స్ పై జర్మనీకి చెందిన వోక్స్ వేగన్, వియత్నాం వింగ్రూప్ జెఎస్సి అనే రెండు సంస్థలతో ఎల్‌జి చర్చలు విచ్ఛిన్నమయ్యాయి. ఈ చర్చలు విఫలమవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే మూసివేయాలని ఎల్‌జీ నిర్ణయించుకుంది.
undefined
ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచింగ్‌ ప్రణాళికను ఎల్‌జీ నిలిపివేసిందని ఒక నివేదికలో పేర్కొంది. రోలబుల్ డిస్‌ప్లే ఫోన్‌ల ఉత్పత్తిని కంపెనీ గత నెలలో నిలిపివేసిందని డోంగా తెలిపింది. 'ది రోలబుల్' గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్‌జీ తిరిగి సీఈఎస్‌ 2021లో ప్రదర్శించింది.
undefined
ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ సీఈఓ క్వాన్ బాంగ్-సియోక్ జనవరిలో మొబైల్ కమ్యూనికేషన్స్‌లో కంపెనీ నష్టాలను చవి చూస్తోందని చెప్పారు. స్మార్ట్ ఫోన్ వ్యాపారం పై ఎల్‌జి తీసుకున్న నిర్ణయాన్ని ఏప్రిల్ ప్రారంభంలోనే ఉద్యోగులతో తెలపవచ్చు. గత ఐదేళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు(రూ.32,856 కోట్లు) కోల్పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
undefined
"మొబైల్ పరికరాల కోసం గ్లోబల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నందున, ఎల్జీ ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా హెరాల్డ్ జనవరిలో ఒక ఎల్జీ అధికారిని ఉటంకిస్తూ తెలపింది.
undefined
click me!