వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసారా.. తెలుసుకోవడానికి ఇలా చేయండి..

First Published | Oct 26, 2021, 7:30 PM IST

 ఈ రోజుల్లో కాలంలో వాట్సాప్(whatsapp) గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇండియాలో లక్షలాది, కోట్ల మంది ప్రజలు వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. టెక్స్ట్ లేదా వాయిస్ , వీడియో కాల్స్ ద్వారా  స్నేహితులు, బంధువులు మొదలైన వారితో మాట్లాడటానికి వాట్సాప్ గొప్ప మార్గం. 

 అలాగే స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చినా వారిని బ్లాక్ చేసే సదుపాయాన్ని కూడా వాట్సాప్ కల్పిస్తోంది. బ్లాక్ చేసిన తర్వాత మీరు ఆ వ్యక్తికి మెసేజ్ లేదా కాల్ చేయలేరు.  కొన్నిసార్లు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే  దాని గురించి కూడా మీకు తెలియదు. కాబట్టి వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఏమిటో తెలుసుకుందాం ? 
 

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే మీరు ప్రొఫైల్ ఫోటోను, లాస్ట్ సీన్  చూడలేరు. బ్లాక్ చేసిట్లయితే మీరు వారి ఆన్‌లైన్ స్టేటస్ కూడా చూడలేరు. 

Latest Videos


ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి మీరు వారికి  మెసేజ్ కూడా పంపవచ్చు. పంపిన మెసేజ్‌లో సింగిల్ టిక్ కనిపిస్తే, మీరు బ్లాక్ అయినట్లే. అయితే  కొన్నిసార్లు నెట్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఒకే టిక్ చూపిస్తుంది. 

ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే మీరు వాట్సాప్‌లో వారికి కాల్ చేయలేరు. మీ కాల్ అస్సలు కనెక్ట్ కావు. అలాగే మీరు బ్లాక్ చేసి ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మరొక సులభమైన మార్గం ఉంది. వాట్సాప్‌లో గ్రూప్‌ని క్రియేట్ చేయడం ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని గ్రూప్‌లో యాడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు నిజంగా బ్లాక్ చేయబడితే మీరు వారిని గ్రూప్ లోకి యాడ్ చేయలేరు.

click me!