జియోఫోన్ నెక్స్ట్ పై సప్రైజింగ్ న్యూస్.. గణేష్ చతుర్థి సందర్భంగా మరో వారంలో...

First Published | Aug 30, 2021, 1:17 PM IST

 భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్‌ ప్రీ-ఆర్డర్‌లను  వచ్చే వారం నుండి  ప్రారంభించనుంది. జియో ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌ల కోసం రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

జియో ఫోన్ నెక్స్ట్ జియో ఫోన్ లైనప్‌లో వస్తున్న సరికొత్త ఫోన్.జియో ఫోన్ నెక్స్ట్  అనేది రిలయన్స్ జియో, గూగుల్  సహకారంతో అభివృద్ధి చేసిన  చౌకైనా స్మార్ట్ ఫోన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆగస్టు 28న జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్ నెక్స్ట్ ని ధృవీకరించారు. ఈ కార్యక్రమంలో జియోఫోన్ నెక్స్ట్ సెప్టెంబర్ 10 అంటే గణేష్ చతుర్థి సందర్భంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.

స్పెసిఫికేషన్స్

రిలయన్స్    జియో ఏ‌జి‌ఎం సమావేశంలో జియో ఫోన్ నెక్స్ట్  స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. లీకైల  నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ 1.3GHz క్లాక్ స్పీడ్‌తో క్వాల్‌కామ్ ఎంట్రీ లెవల్ స్నాప్‌డ్రాగన్ 215 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది.

జియోఫోన్ నెక్స్ట్ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుందని ఇందులో 2జి‌బి అండ్ 3జి‌బి ర్యామ్  దీనితో 16 జి‌బి అండ్ 32 జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. అదనంగా జియోఫోన్ నెక్స్ట్ 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 2500 mAh బ్యాటరీతో 5.5-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే ఉండవచ్చు అని భావిస్తున్నారు.
 


జియో అందిస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో  సెల్ఫీల కోసం  8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. జియోఫోన్ నెక్స్ట్‌కి పాలికార్బోనేట్ రియర్ ప్యానెల్ ఇచ్చారు, దీనికి పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) పై రన్ అవుతుంది. అలాగే కేవలం సింగిల్ బటన్ టచ్‌తో ఫోన్  ఆపరేషన్ భాషను మార్చే అవకాశం ఉంది.
 

ఇంటర్నల్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మీ మైజియో యాప్ లో ఫోన్ బ్యాలెన్స్ గురించి మీకు తెలియజేస్తుంది. జియో సావ్న్ యాప్‌లో మ్యూజిక్ ప్లే చేయమని కూడా గూగుల్ అసిస్టెంట్‌ని కూడా అడగవచ్చు.
 

ధర

జియో అండ్ గూగుల్ ద్వారా వస్తున్న కొత్త జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ధరపై అధికారిక సమాచారం లేనప్పటికీ కొన్ని పుకార్లు,  నివేదికల ప్రకారం స్మార్ట్‌ఫోన్ ధర రూ. 3,499 ఉంటుందని అంచనా.

 44వ ఎజిఎమ్ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనకు అనుగుణంగా జియోఫోన్ నెక్స్ట్ దేశంలో అత్యంత బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గా ధర ఉండవచ్చు.

Latest Videos

click me!