అన్ని టెలికాం కంపెనీలు లాంగ్ వాలిడిటీ ప్లాన్లను అందిస్తున్నాయి అయితే వాటి ధరలు కాస్త అధికంగా ఉన్నాయి. కొంతమందికి డాటా అవసరం లేనప్పటికి ఈ ప్లాన్‌లతో డేటా కూడా అందుబాటులో ఉంది. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో అటువంటి ప్లాన్ గురించి తెలుసుకుందాం.. అలాగే వీటి ధర చాలా తక్కువ ఇంకా వాలిడిటీ కూడా ఎక్కువ.
మీకు డేటా అవసరం లేనట్లయితే మీ జియో నంబర్ నుండి కాల్స్ మాత్రమే చేయాలనుకుంటే జియో ప్రీ-పెయిడ్ ప్లాన్ రూ. 329 మీకు ఉత్తమమైనది ఇంకా చౌకైనది కూడా. జియో రూ .329 ప్లాన్ ఎక్కువ కాలం వాలిడిటీ కావాలనుకునే వారి కోసం తీసుకొచ్చారు.
ఈ ప్లాన్‌లో మీరు 84 రోజుల వాలిడిటీ పొందుతారు. మీకు 6 జిబి డేటా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ క్లాస్ చేయడానికి సరైనది, ఎందుకంటే మీకు 84 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అండ్ 1000 ఎస్‌ఎంఎస్ అందుబాటులో ఉంటాయి.
మీకు జియో రూ .329 ప్లాన్ కనిపించకపోతే, మీరు జియో వెబ్‌సైట్ లేదా మై జియో యాప్‌కి వెళ్లి, OTHERS విభాగాన్ని చెక్ చేయాలి. ఇందులో మూడు ప్లాన్స్ ఉంటాయి అందులో రెండవ ప్లాన్ ఇది.
సెప్టెంబర్ 10 నుండి జియోఫోన్ నెక్స్ట్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. జియో ఫోన్ నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్. జియో ఫోన్ నెక్స్ట్ గూగుల్ భాగస్వామ్యంతో రూపొందించారు. దీనితో కంపెనీ కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించవచ్చు. జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ .4,000 కంటే తక్కువగా ఉంటుందని లీకైన నివేదికలు సూచిస్తున్నాయి.