బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? 10వేల నుండి 15వేలలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

First Published | Aug 28, 2021, 6:49 PM IST

మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం మార్కెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు  మీరు గొప్ప ఫీచర్లతో లిమిటెడ్ బడ్జెట్ లోనే కొనుగోలు చేయవచ్చు.రూ .10వేల నుంచి రూ .15వేల పరిధిలో స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే బడ్జెట్ ధర పరిధిలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్  స్మార్ట్‌ఫోన్‌ నుండి దేనిని సెలెక్ట్ చేసుకోవాలో మీరు గందరగోళంగా ఉంది..
 

6జి‌బి ర్యామ్ నుండి 6000 mAh బ్యాటరీ వరకు రియల్ మీ, షియోమీ, మోటోరోల, స్యామ్సంగ్, పోకో వంటి బ్రాండ్‌లు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను  అందింస్తున్నాయి. మీరు రూ. 10వేల నుండి రూ .15వేల ధరల మధ్యలో కొనుగోలు చేసే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా  మీకోసం..

ఇటీవల లాంచ్ చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21 (2021) బడ్జెట్ విభాగంలో కొనుగోలుదారుల టాప్ ఆప్షన్స్ లో ఒకటిగా మారింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల సమోలెడ్ ఇన్ఫినిటీ- యు డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11-ఆధారిత వన్ యూ‌ఐ కోర్ 3.1 పై రన్ అవుతుంది.  

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21 ఆక్టా-కోర్ Exynos 9611 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మాలి- G72 ఎం‌పి3 GPU అండ్ 6జి‌బి  LPDDR4x ర్యామ్‌తో వస్తుంది. ఈ వేరియంట్  4జి‌బి ర్యామ్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .12,499. 

Latest Videos


రియల్‌మీ నార్జో 20 బడ్జెట్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. గత సంవత్సరం లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది ఇంకా 6000mAh మెగా బ్యాటరీతో వస్తుంది. 
 
ఈ స్మార్ట్‌ఫోన్ 48ఎం‌పి ఏ‌ఐ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది ఇంకా 18W క్విక్ ఛార్జ్ కోసం సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ నార్జో 20 4జి‌బి+64జి‌బి అండ్ 4జి‌బి+128జి‌బి వేరియంట్‌  ధర  వరుసగా రూ. 10,499 అండ్ రూ .11,499. 

షియోమీ రెడ్ మీ 9 పవర్ 6జి‌బి ర్యామ్ అండ్ 128జి‌బి స్టోరేజ్‌తో వస్తుంది. రూ .12,999 ధర కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 610 జి‌పి‌యూతో  పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మైటీ బ్లాక్, బ్లేజింగ్ బ్లూ, ఫియరీ రెడ్ అండ్ ఎలక్ట్రిక్ గ్రీన్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
 

మోటో జి10 పవర్ 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ (720x1,600 పిక్సెల్స్) మ్యాక్స్ విజన్ డిస్‌ప్లేతో 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 SoC ద్వారా శక్తిని పొందుతుంది, అలాగే 4జి‌బి  ర్యామ్ తో వస్తుంది.

డివైజ్ క్వాడ్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. దీనిలో 48ఎం‌పి ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్‌తో 8ఎం‌పి సెన్సార్, మాక్రో లెన్స్‌తో 2ఎం‌పి  సెన్సార్, 2ఎం‌పి డెప్త్ సెన్సార్. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 10,499 కి విక్రయిస్తోంది. 

గత సంవత్సరం ప్రారంభించిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్41, 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఎస్ఏ‌ఎం‌ఓఎల్‌ఈ‌డి ఇన్ఫినిటీ యు డిస్‌ప్లే, 64ఎం‌పి బ్యాక్ కెమెరా సిస్టమ్, 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ బ్లూ, ఫ్యూజన్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.
 

click me!