JioPC : కేవలం రూ.400 ఖర్చుతో... మీ టీవీని కంప్యూటర్ గా మార్చుకొండి, ఎలాగో తెలుసా?

Published : Jul 29, 2025, 06:53 PM ISTUpdated : Jul 29, 2025, 07:03 PM IST

కేవలం నాలుగైదు వందల ఖర్చుతో రూ.40,000 నుండి రూ.50,000 విలువైన కంప్యూటర్స్ చేసే పనిని మన టీవీలోనే చేయవచ్చు. ఇందుకోసమే టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోపిసి తీసుకువచ్చింది. టీవిలో కంప్యూటర్ సేవలు ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
ఇక ప్రతి టీవి కంప్యూటరే...

JioPC : టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది రిలయన్స్ జియో... నగరాలు, పట్టణాలకు పరిమితమైన ఇంటర్నెట్ సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈ అంబానీ కంపెనీదే. ఇప్పుడు మరోసారి భారతదేశంలో సరికొత్త సేవలను ప్రారంభించింది జయో... ఇంట్లోని టీవీనే కంప్యూటర్ గా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం జియో నుంచి క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ ‘జియోపీసీ’ ని రెడీ చేసింది. దేశంలోనే మొట్టమొదటి AI- రెడీ క్లౌడ్ కంప్యూటర్ ‘JioPC’ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఈ JioPC సురక్షితమైన కంప్యూటింగ్‌ కోసం తీసుకువచ్చిన సంచలనాత్మక క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్. జీరో మెయింటెనెన్స్ తో మొట్టమొదటి ‘పే యాజ్ యు గో’ మోడల్‌తో భారతదేశంలో కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రూపొందించబడింది.

జియో పీసీ కొనుగోలుకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు... రూ.50,000 వరకు విలువైన హై-ఎండ్ పిసిలోని అన్ని ఫీచర్స్ జియో పీసీలో పొందవచ్చు. ఎటువంటి లాక్ ఇన్ లేకుండా కేవలం నెలకు రూ.400 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లతో JioPC సేవలను పొందవచ్చు. ఏ స్క్రీన్‌నైనా పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మారుస్తుంది... దీనికి ఖరీదైన హార్డ్‌వేర్ లేదా అప్‌గ్రేడ్‌లు అవసరం లేదు. ప్లగ్ ఇన్ చేయండి, సైన్ అప్ చేయండి , కంప్యూటింగ్ ప్రారంభించండి.

DID YOU KNOW ?
గేమ్ ఛేంజర్ గా JioPC
భారతదేశంలో 15శాతం మంది మాత్రమే కంప్యూటర్ ను కలిగివున్నారు... కానీ 70 శాతానికి పైగా టీవిని కలిగివున్నారు. ఇదే టీవిని కంప్యూటర్ గా మార్చి ప్రజలకు సరికొత్త సేవలను అందించనుంది JioPC.
25
JioPC ని ఎలా సెటప్ చేయాలి

1. మీ జియో సెట్-టాప్ బాక్స్‌ను ఆన్ చేసి యాప్స్ లోకి వెళ్ళండి

2. JioPC యాప్‌ లో ‘Get Started’ పై క్లిక్ చేయండి

3. మీ కీబోర్డ్, మౌస్‌ను ప్లగ్ ఇన్ చేయండి

4. మీ ఫోన్ నంబర్ ఉపయోగించి సైన్ ఇన్ చేయండి లేదా కొత్తగా రిజిస్టర్ చేసుకోండి

5. లాగిన్ అయ్యి మీ క్లౌడ్ కంప్యూటర్‌ను తక్షణమే ఉపయోగించుకోండి

35
JioPC కి సంబంధించి కీలక అంశాలు..
  • లాక్-ఇన్ లేకుండా, ఫ్లెక్సిబుల్ పే-యాజ్-యు-గో ప్లాన్‌లతో నెలకు రూ. 400 నుండి ప్రారంభమవుతుంది.
  • హార్డ్‌వేర్ అవసరం లేదు, ఏ స్క్రీన్‌నైనా స్మార్ట్ PCగా మారుస్తుంది.
  • ఎటు వంటి ఆలస్యం లేకుండా, ఎప్పటికప్పుడు అప్డేట్ లు, అత్యంత వేగవంతమైన బూటప్
  • నెట్‌వర్క్ స్థాయి భద్రత ఉంటుంది. వైరస్, మాల్వేర్, హ్యాక్-ప్రూఫ్ సమస్యలుండవు.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్ వెర్షన్), Jio WorkSpace యాక్సెస్ లభిస్తుంది.
  • అన్ని JioFiber, Jio AirFiber వినియోగదారులకు భారతదేశం అంతటా అందుబాటులో ఉంది.
  • ఒక నెల ఉచిత ట్రయల్, జియో వర్క్‌స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్), 512 GB క్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.
45
Adobe తో జియో ఒప్పందం

క్రియేటివిటీ, ప్రొడక్టివిటీని పెంచడానికి JioPC అడోబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది... కాబట్టి JioPC వినియోగదారులకు ప్రపంచ స్థాయి డిజైన్, ఎడిటింగ్ సాధనం అయిన అడోబ్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సెస్ కల్పిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో అన్ని కీలకమైన AI సాధనాలకు యాక్సెస్ లభిస్తుంది. ఇది 512 GB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఇవన్ని సబ్‌స్క్రిప్షన్‌లో చేర్చబడ్డాయి.

55
JioPC వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది

జియోపీసీ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్వయంఉపాధిదారులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేవారు నుండి పాఠశాలకు వెళ్లే పిల్లల కోసం తయారుచేయబడింది.

JioPC కంప్యూటింగ్‌ను తెలివిగా, సురక్షితంగా భవిష్యత్తుకు సురక్షితం చేస్తుంది. ఇది మీతో పాటు అభివృద్ధి చెందుతుంది, మీతో పాటు నేర్చుకుంటుంది, మీ అవసరాలకు అనుగుణంగా పెరుగుతుంది. తరగతి గదుల నుండి దుకాణాల వరకు, వర్క్ ఫ్రమ్ హోం నుండి నుండి సృజనాత్మక స్టూడియోల వరకు — JioPC అనేది భారతదేశపు కంప్యూటర్-యాజ్-ఎ-సర్వీస్ విప్లవం.

ఈ JioPC గురించి మరిన్ని వివరాలకు https://www.jio.com/jiopc ని సందర్శించండి.

Read more Photos on
click me!

Recommended Stories