సౌండ్‌కోర్ సైనా నెహ్వాల్ ఎడిషన్ లైట్ ఇయర్‌బడ్స్.. ఇప్పుడు 50% ఎక్కువ బేస్‌తో..

First Published Oct 23, 2021, 5:51 PM IST

గ్లోబల్ ఆడియో టెక్నాలజీ కంపెనీ అంకర్(anker)  చెందిన సౌండ్‌కోర్(soundcore)  బ్రాండ్ సైనా నెహ్వాల్ స్పెషల్ ఎడిషన్ TWS- లైఫ్ నోట్ ఇ ఇయర్‌బడ్స్ ని విడుదల చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధర  రూ .2,799 అందుబాటులోకి వచ్చాయి, అయితే లాంచ్ ఆఫర్ కింద దీనిని రూ .1,999 కి కొనుగోలు చేయవచ్చు. 

కొత్త ఇయర్‌బడ్‌ల గురించి చెప్పాలంటే 32 గంటల ప్లేటైమ్ క్లెయిమ్ చేయబడింది. ఈ ఇయర్‌బడ్స్  ఇంతకు ముందు కంటే 3EQ మోడ్స్, 50 శాతం ఎక్కువ బేస్, లౌడ్‌నెస్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా 18 నెలల వారంటీతో వస్తుంది.

లైఫ్ నోట్ ఇ ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 10ఎం‌ఎం డ్రైవర్‌తో వస్తాయి. దీనికి 3 స్పెషల్ అండ్ EQ మోడ్స్, సౌండ్‌కోర్ సిగ్నేచర్ తో వస్తుంది. ఇందులో EQ డిఫాల్ట్ గా ఉంటుంది. ట్రెబుల్, గ్రేట్ బేస్, అలాగే  బ్యాలెన్స్డ్  సౌండ్  అందిస్తుంది. బేస్ బూస్టర్ బేస్-హెవీ మ్యూజిక్ 50 శాతానికి పైగా పెంచుతుంది. 

పోడ్‌కాస్ట్ నుండి సౌండ్ చాలా స్పష్టంగా ఉంటుంది. దీన్ని మరొక మోడ్‌కి మార్చడానికి మీరు కుడి చెవిపై ఉంచిన ఇయర్‌బడ్‌లను 3 సార్లు నొక్కి మీకు ఇష్టమైన మ్యూజిక్, వీడియోలు లేదా ఇతర కంటెంట్ చూడవచ్చు. కాల్స్ లో వాయిస్ క్వాలిటీ మెరుగుపరచడానికి ఏ‌ఐ అల్గారిథమ్‌ ఇచ్చారు.
 

ఈ చిన్న-సైజ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల బరువు 0.16 oz (4.6 గ్రా), అంటే ఏదైనా స్టాండర్డ్ ఇయర్‌బడ్‌ల కంటే 10 శాతం వరకు తేలికైనది. ఇంకా చాలా చిన్నవి, తక్కువ బరువు కూడా, వాటిని ఉపయోగించినప్పుడు  మీకు బరువుగా ఏమాత్రం అనిపించదు. పోర్టబుల్ ఛార్జర్‌గా పనిచేసే ఇయర్‌బడ్‌లను ఉంచడానికి ఒక కేసు కూడా లభిస్తుంది. ఇయర్‌బడ్‌ల ప్లేబ్యాక్ సమయం  32 గంటల వరకు. ఈ ఇయర్‌బడ్‌లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు వాటితో 8 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు.

లాంచ్ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఆడియో బ్రాండ్‌లలో ఒకటైన అంకర్ సౌండ్‌కోర్‌తో మా సిగ్నేచర్ ఆడియో కలెక్షన్ ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రాడక్ట్ లైఫ్ నోట్-ఇ నేటి తరం అవసరాలను పూర్తిగా తీరుస్తుంది. ఇంకా కొత్త, లేటెస్ట్, ఆకర్షణీయమైన పవర్ ప్యాక్డ్ ఫీచర్లతో వస్తుంది. ఈ సౌండ్‌కోర్ ఉత్పత్తి ఆడియో పరిశ్రమలో గేమ్ ఛేంజర్ పాత్రను పోషిస్తుంది అని అన్నారు.

లైఫ్ నోట్ E ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు వన్ స్టెప్  పెరింగ్, సింగిల్ ఇయర్‌బడ్ మోడ్‌ చేస్తుంది. దీనిలో అల్ట్రా-స్టేబుల్ కనెక్షన్ కోసం సరికొత్త బ్లూటూత్ 5.0 టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ IPX5 వాటర్ ప్రూఫ్ రేటింగ్ పొందింది.

click me!