టెలికాం రంగంలో జియో సంచలనం.. ఎయిర్‌టెల్ పై 4జీ స్పీడ్‌లో సరికొత్త రికార్డు..

First Published | Jun 16, 2021, 7:04 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జి విభాగంలో సెకనుకు ఆవరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 20.7ఎం‌బితో  టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, వోడాఫోన్ ఐడియా మే నెలలో 6.7 ఎమ్‌బిపిఎస్ డేటా స్పీడ్‌తో అప్‌లోడ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచినట్లు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పబ్లికేషన్ తాజా డేటాలో తెలిపింది.
 

రిలయన్స్ జియో 4జి నెట్‌వర్క్ స్పీడ్ స్వల్పంగా పెరిగింది, అయితే ఇది దాని సమీప పోటీదారి వోడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్లు ఎక్కువ. వోడాఫోన్ ఐడియా సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 6.3 ఎమ్‌బిపిఎస్.
undefined
ఆగష్టు 2018లో వోడాఫోన్ ఐడియా విలీనం అయిన తరువాత నెట్‌వర్క్ స్పీడ్ ట్రాయ్ క్లబ్బింగ్ చేయడం ఇదే మొదటిసారి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8న ప్రచురించిన గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్ అతితక్కువ ఆవరేజ్ స్పీడ్ 4.7 ఎమ్‌బిపిఎస్ తో ఉంది.
undefined

Latest Videos


డౌన్‌లోడ్ స్పీడ్ వినియోగదారులకు ఇంటర్నెట్ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది, అప్‌లోడ్ స్పీడ్ ఫోటోలు లేదా వీడియోలను కాంటాక్ట్స్ కి పంపడంలో లేదా షేర్ చేయడంలో సహాయపడుతుంది.
undefined
ట్రాయ్ ప్రకారం వోడాఫోన్ ఐడియా మే నెలలో ఆవరేజ్ 6.3 ఎమ్‌బిపిఎస్ అప్‌లోడ్ స్పీడ్ ఉంది. దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో, భారతి ఎయిర్‌టెల్ 3.6 ఎమ్‌బిపిఎస్‌తో ఉంది.
undefined
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ ఎంచుకున్న ప్రాంతాలలో 4జి సేవలను ప్రారంభించింది, అయితే నెట్‌వర్క్ స్పీడ్ ట్రాయ్ చార్టులో లేదు. రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశం అంతటా సేకరించిన డేటా ఆధారంగా ఆవరేజ్ స్పీడ్ ట్రాయ్ లెక్కిస్తుంది.
undefined
click me!