జియో ఫోన్ పై గూగుల్ సి‌ఈ‌ఓ స్వీట్ రెస్పాన్స్.. మార్కెట్‌లో ఇలాంటి ఫోన్‌లకు చాలా డిమాండ్ ఉందంటూ..

Ashok Kumar   | Asianet News
Published : Oct 27, 2021, 04:16 PM IST

 రిలయన్స్ జియో  కొత్త స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ మేకింగ్ వీడియోను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. అయితే జియో ఫోన్ నెక్స్ట్ మేకింగ్ వీడియోలో ఎన్నో ఫీచర్లు కూడా నివేదించింది. తాజాగా జియో ఫోన్ దీపావళి పండగకి  లాంచ్ అవుతుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. జియో ఫోన్ నెక్స్ట్ గూగుల్, జియో భాగస్వామ్యంతో తయారు చేశారు. జియో ఫోన్ నెక్స్ట్ కోసం గూగుల్ ప్రత్యేకంగా ప్రగతి ఓ‌ఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది దీనిని ఆండ్రాయిడ్ ఆధారంగా రూపొందించారు.

PREV
14
జియో ఫోన్ పై గూగుల్ సి‌ఈ‌ఓ స్వీట్ రెస్పాన్స్.. మార్కెట్‌లో ఇలాంటి ఫోన్‌లకు చాలా డిమాండ్ ఉందంటూ..

సుందర్ పిచాయ్ జియో ఫోన్ నెక్స్ట్ గురించి ఒక ప్రకటనలో ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశ డిజిటల్ ఫార్మేషన్ కి పునాదిగా నిరూపిస్తుందని చెప్పారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్‌ను శాసిస్తుందని, దీనికి ప్రధాన కారణం ఫోన్ ధర, ఫీచర్లు అని ఆయన అన్నారు. ఫీచర్ ఫోన్‌లకు బదులుగా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించాలని ప్రజలు కోరుకుంటున్నారని పిచాయ్ అన్నారు. మార్కెట్‌లో ఇలాంటి ఫోన్‌లకు చాలా డిమాండ్ ఉంది కానీ ఫోన్ అందుబాటులో లేదు.
 

24

        Jio Phone Next: Sundar Pichai confirms,                          Jio Phone Next will be launched on Diwali
 

34

        Jio Phone Next: Sundar Pichai confirms,                          Jio Phone Next will be launched on Diwali
 

44

ప్రీలోడెడ్ జియో అండ్ గూగుల్ యాప్స్ 
 గూగుల్ యాప్ స్టోర్ ప్లే స్టోర్ ద్వారా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందువల్ల ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మిలియన్ల యాప్‌ల నుండి ఏదైనా యాప్‌ని ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంది. ఇంకా ఎన్నో జియో, గూగుల్ యాప్‌లతో ప్రీలోడ్ చేసింది.

click me!

Recommended Stories