Call History: ఎవరితో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఈ ఒక్క యాప్‌తో మొత్తం తెలిసిపోతుంది

Published : Aug 02, 2026, 08:35 PM IST

Call History: మీరు జియో యూజ‌ర్లా.? అయితే మీ మొబైల్‌లో ఎవరికి కాల్ చేశారు, ఎప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు వంటి వివరాలను సులభంగా చూసే అవకాశం ఉంది. ఈ సౌకర్యాన్ని జియో తన మైజియో యాప్‌లో అందిస్తోంది. ఈ వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం.

PREV
14
మై జియో యాప్‌లో ఏమేం చూడొచ్చు?

మై జియో యాప్ ద్వారా మీరు గతంలో చేసిన కాల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు. ఏ తేదీన కాల్ చేశారు, ఏ సమయంలో మాట్లాడారు, ఎవరికి కాల్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. అవసరమైతే ఈ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ఇమెయిల్‌కు పంపించుకోవడం కూడా సాధ్యమే.

24
కాల్ హిస్టరీ ఎలా చెక్ చేయాలి?

ముందుగా మీ ఫోన్‌లో మైజియో యాప్ ఇన్‌స్టాల్ చేసి, మీ జియో నంబర్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత యాప్‌లో కనిపించే మొబైల్‌ విభాగాన్ని సెల‌క్ట్ చేసుకోవాలి. అక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే Recharge & History అనే ఆప్ష‌న్‌ కనిపిస్తుంది. ఇందులో My Statement అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కాల్ హిస్టరీ చూసే అవకాశం ఉంటుంది.

34
180 రోజుల వరకు కాల్ వివరాలు అందుబాటులో

My Statement ఎంపిక చేసిన తర్వాత మీరు 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు లేదా మీకు కావాల్సిన తేదీలను ఎంపిక చేసుకునే Custom Date Range ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. జియో సమాచారం ప్రకారం, గరిష్ఠంగా 180 రోజుల వరకు కాల్ హిస్టరీని ఈ యాప్ ద్వారా పొందవచ్చు. అనంతరం స్టేట్‌మెంట్‌ను యాప్‌లోనే చూడవచ్చు, ఇమెయిల్ ద్వారా పొందవచ్చు లేదా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

44
జాగ్ర‌త్త‌లు కూడా అవ‌స‌ర‌మే

ఈ సౌకర్యం మీ కాల్ వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మీ ఫోన్ ఇతరుల చేతికి వెళితే, వారు కూడా మీ కాల్ హిస్టరీని చూసే అవకాశం ఉంటుంది. అందుకే ఫోన్‌కు స్ట్రాంగ్‌ స్క్రీన్ లాక్, పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ లాక్ పెట్టుకోవడం మంచిది. అలాగే MyJio యాప్‌ను ఇతరులు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే మీ వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories