Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

Published : Oct 06, 2026, 12:36 PM IST

మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కోరుకునే కస్టమర్ల కోసం రిలయన్స్ జియో అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఈ 123 రీచార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
13
జియో 123 రీఛార్జ్ ప్లాన్

మొబైల్ రీఛార్జ్ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. టెలికాం కంపెనీలు అమాంతం రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై ఆర్థికభారం పడుతోంది. ఈ క్రమంలో చాలామంది తక్కువ ధరకే ఎక్కువ రోజుల వాలిడిటీతో వచ్చే ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో జియో తీసుకొచ్చిన 123 రీఛార్జ్ ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కేవలం 123 రూపాయలతో రీచార్జ్ తో 28 వాలిడిటీ అందించే ప్లాన్ ఇది. ఇందులో రోజూ 500MB హై-స్పీడ్ డేటా కూడా వస్తుంది. అంటే 28 రోజులకు కలిపి మొత్తం 14GB డేటాను వాడుకోవచ్చు. ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేయడానికి, వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ వాడటానికి ఈ డేటా సరిపోతుంది. దీనికి తోడు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే రోజూ 300 SMSలు పంపుకునే సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంది.

23
జియో రూ.123 ప్లాన్ ఎవరికి వర్తిస్తుంది?

ఈ ప్లాన్‌లో ఉన్న లాభాలు మాత్రమే కాదు, ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యం. రూ.123 ప్లాన్ జియో కస్టమర్లందరికీ వస్తుందని అనుకోవద్దు. ఇది కేవలం 'జియోభారత్' (JioBharat) లేదా అలాంటి 4G ఫీచర్ ఫోన్లు వాడే యూజర్ల కోసం మాత్రమే తీసుకొచ్చారు. కాబట్టి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా ఐఫోన్ వాడేవాళ్లు ఈ ప్లాన్‌ను డైరెక్ట్‌గా రీఛార్జ్ చేసుకోలేరు. రీఛార్జ్ చేసే ముందు మీ మొబైల్, మీ నంబర్‌కు ఈ ప్లాన్ వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కీప్యాడ్ ఫోన్లు వాడుతూ, తక్కువ ఇంటర్నెట్ అవసరం ఉన్నవాళ్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

33
జియో రూ.123 ప్లాన్‌లో అదనపు బెనిఫిట్స్

ఈ ప్లాన్‌లో కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లాభాలతో పాటు, మీరు వాడే డివైజ్‌ను బట్టి కొన్ని అదనపు జియో యాప్స్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసులు కూడా ఉచితంగా లభించే అవకాశం ఉంది. అందుకే రీఛార్జ్ చేయడానికి ముందే 'మైజియో' (MyJio) యాప్‌లో గానీ, జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో గానీ మీ నంబర్‌కు వచ్చే పూర్తి లాభాలను చెక్ చేసుకోవడం మంచిది.

రూ.123 కే వస్తుంది కదా అని అందరికీ వర్తిస్తుందని గుడ్డిగా రీఛార్జ్ చేయొద్దు. ముందుగా మీ ఫోన్‌కు ఇది సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోండి. తక్కువ ఖర్చుతో కాల్స్ మాట్లాడుకుంటూ, బేసిక్ ఇంటర్నెట్ వాడుకునే వాళ్లకు సరైన ఫోన్ ఉంటే మాత్రం ఇది నిజంగా ఒక బెస్ట్ ప్లాన్.

Read more Photos on
click me!

Recommended Stories