బిగ్ అప్‌డేట్‌.. ట్విటర్‌ సీఈవో ఇచ్చిన ప్లెజెంట్ సర్ప్రైజ్! రాబోతున్న కొత్త ఫీచర్ ఇదే..

First Published | Sep 21, 2023, 6:12 PM IST

అన్నీ చేయగలిగిన యాప్‌ని రూపొందించాలనే తన చిరకాల స్వప్నం దిశగా ఎలాన్ మస్క్ మరో పెద్ద అడుగు వేయబోతున్నాడంటే అతిశయోక్తి కాదు. అంటే, ఈ ఒక్క యాప్‌తో ట్విట్టర్ (X) యూజర్లు అన్ని రకాల సర్వీసెస్ పొందాలని  కోరుకుంటున్నారు. 
 

మైక్రో బ్లగ్గింగ్ ట్విటర్ సైట్‌లో ఇప్పటికే అనేక మార్పులు చోటు చేసుకోగా, ఎలోన్ మస్క్ ట్విటర్ యూజర్లు దీనిని ఉపయోగించి డబ్బు లావాదేవీలు జరిపే పద్ధతిని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.  ఎలోన్ మస్క్  గత సంవత్సరం ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పుడు, అతను చాలా కాలంగా కలలుగన్న యాప్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను మారుస్తాడని ఎవరూ అనుకోలేదు.

ట్విట్టర్ ని ఎలోన్ మస్క్ సొంతం చేసుకోవడానికి ముందు యూజర్ల అభిప్రాయాలను పరిమిత మార్గాల్లో  వ్యక్తపరచడానికి ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. కానీ ఇప్పుడు, ఈ ప్లాట్‌ఫారమ్ లో మీరు లాంగ్ వీడియోలను షేర్ చేయడానికి ఇంకా ఇతరులతో పాటు లాంగ్ ట్వీట్‌లను పోస్ట్ చేయడానికి  ఉపయోగపడుతుంది. త్వరలో, మీరు Twitterని ఉపయోగించి పేమెంట్స్ చేయవచ్చు. ఈ విషయాన్నీ CEO Linda Yaccarino షేర్ చేసిన కొత్త వీడియో కన్ఫర్మ్ చేసింది.
 


X అధినేత ఎలోన్ మస్క్‌  తాజగా  Xని ఉపయోగించేందుకు యూజర్లకు ఛార్జీ విధించే అవకాశం గురించి తెలిపారు. ట్విటర్ యాప్‌ను ఉపయోగించేందుకు వినియోగదారులు ప్రతినెలా  చిన్న మొత్తం ఛార్జ్  చెల్లించాల్సి ఉంటుందని  ఎలోన్ మస్క్  సూచించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా  ఈ విషయాన్ని అతను  ప్రస్తావించడం గమనార్హం.
 

ఈ ప్లాట్‌ఫారమ్‌పై బాట్లను(bots)  కంట్రోల్ లో ఉంచేందుకు చార్జెస్  ప్రవేశపెడతామని చెప్పారు. గత ఏడాది US$44 బిలియన్లకు ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో చాలా మార్పులు చేశాడు.

ముఖ్యంగా, అతను ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, అప్పటి CEO బరాక్ అగర్వాల్‌ను తొలగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ముఖ్యంగా, అతను సెలబ్రిటీ అకౌంట్స్ ని గుర్తించే "బ్లూ చెక్" వెరిఫికేషన్ సిస్టమ్‌లో మార్పులు చేసాడు, దానిని ఎవరైనా పొందేందుకు పేమెంట్  సబ్స్క్రిప్షన్ సర్వీస్ గా మార్చాడు.

Latest Videos

click me!