ఫ్యాన్ ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి బెడ్ నుండి లేవాల్సిన పని లేదు.. అందమైన్ డిజైన్ తో రిమోట్ ఫ్యాన్స్..

First Published | Sep 20, 2023, 6:54 PM IST

మీరు మీ ఇంటి అందాన్ని పెంచేందుకు హైటెక్ సీలింగ్ ఫ్యాన్‌ని కొనాలని   చూస్తున్నారా..  రిమోట్ కంట్రోల్ ఫ్యాన్‌లు మీకు మంచి అప్షన్ గా ఉంటాయి. రిమోట్ ఫ్యాన్ గొప్పదనం ఏమిటంటే, దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మీరు మళ్లీ మళ్లీ స్విచ్ దగ్గరకు  వెళ్లాల్సిన అవసరం లేదు.  అంతేకాకుండా రిమోట్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు. 

రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్  రిమోట్ కంట్రోల్ లేదా మొబైల్ అప్లికేషన్‌లోని బటన్స్  ఉపయోగించి మీరు ఫ్యాన్ స్పీడ్  మార్చవచ్చు, ఫ్యాన్‌ను ఆన్ ఇంకా ఆఫ్ చేయవచ్చు. అంటే మంచం మీద నుంచి లేవకుండానే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయవచ్చు. తక్కువ ధర రిమోట్ ఫ్యాన్ల గురించి మీకోసం.. 

క్రాంప్టన్ ఎనర్జీ క్రోమెయిర్
Crompton Energion Cromair అనేది 120 mm సైజ్ లో 3 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్. దీనికి రిమోట్ సపోర్ట్ కూడా అందించబడింది. ఈ ఫ్యాన్  5 స్టార్ రేటింగ్ తో  అలాగే హై స్పీడ్ మోటారుతో వస్తుంది.  28W పవర్‌తో కూడా ఎనర్జీ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాన్ 5 సంవత్సరాల వారంటీ ఇంకా  5 స్పీడ్ కంట్రోల్స్ తో వస్తుంది. దీనితో పాటు, టైమర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నాలుగు గంటల తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయ్యేలా టైమర్ సెట్ చేసుకోవచ్చు.
 


ఆటమ్బెర్గ్ రినైసాన్స్ 
ఈ ఫ్యాన్‌కు 5 స్టార్, 1200 mm BLDC మోటార్ 3 బ్లేడ్‌ల సపోర్ట్  తో వస్తుంది. సీలింగ్ ఫ్యాన్‌తో రిమోట్  ఉంటుంది  ఇంకా ఈ ఫ్యాన్ వాట్స్ 28W. కంపెనీ ఫ్యాన్‌తో మూడు సంవత్సరాల వారంటీని ఇస్తుంది ఇంకా  ఫ్యాన్ 65 శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తుందని కంపెనీ పేర్కొంది. 

ఓరియంట్ ఎలక్ట్రిక్ ఐ టోమ్
ఓరియంట్ ఎలక్ట్రిక్ I Tome 1200mm బ్లేడ్‌తో వస్తుంది. దీనికి 5 స్టార్ రేటింగ్‌తో రిమోట్ సపోర్ట్ ఉంది. ఈ  BLDC ఎనర్జీ  సేవింగ్  తో 26W పవర్  వినియోగిస్తుంది. దీనితో కంపెనీ 3 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ I టోమ్ 370 ఆర్‌పిఎమ్ హై స్పీడ్ తో 220 సెంమీ ఎయిర్ డెలివరీతో నడుస్తుంది. 

హావెల్స్ గ్లేజ్ డెకొరేటివ్ 
హావెల్స్ గ్లేజ్ డెకరేటివ్ BLDC 1200mm ఎనర్జీ  సేవింగ్, రిమోట్ కంట్రోల్ ఇంకా 5 స్టార్ సెట్టింగ్‌తో వస్తుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ తక్కువ వోల్టేజీని కంట్రోల్ చేయడానికి ఇంటర్నల్ వోల్టేజ్ స్టెబిలైజేషన్  ఉంది. ఇంకా 1 నుండి 4 గంటల వరకు టైమర్ సెట్టింగ్‌  కూడా దీనిలో ఉంది. 

Latest Videos

click me!