అయితే ఇవి తర్వాత మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? స్మార్ట్‌ఫోన్‌లు అండ్ 4కె కెమెరాల యుగంలో ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ పెద్ద తేడాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో AI అప్లికేషన్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఫోటోల్యాబ్ అనే కొత్త యాప్ ప్రజల్లో భారీ క్రేజ్ సృష్టించింది. ఈ యాప్‌లను ఉపయోగించి ప్రజలు AI మోడల్‌లను రూపొందించుకుంటారు. వీటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ చేస్తుంటారు.
ఈ రకమైన అప్లికేషన్‌లకు అతిపెద్ద ముప్పు ఏమిటంటే, సైబర్ నేరస్థులు మీ ఇమేజ్ ప్రాసెసింగ్ విధానాలను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. Photolab వంటి AI యాప్‌లకు ఎక్కువగా మీ గ్యాలరీ ఫోటోలకు యాక్సెస్ అవసరం. అయితే దీని వల్ల మీ ప్రైవసీ గురించి ఆందోళనలను పెంచవచ్చు.
మీ ఫోటోలు ఇంకా పర్సనల్ డేటాను యాప్ డెవలపర్‌లు లేదా థర్డ్ పార్టీలు స్టోర్ చేయడం లేదా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. AI టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున హ్యాకింగ్ ఇంకా మోసాల నివారణలో ఇటువంటి అప్లికేషన్ల దుర్వినియోగం నుండి రక్షించడానికి ఈ లోపాలను పరిష్కరించడం చాలా ముఖ్యం.
ఈ యాప్ ఆండ్రాయిడ్ ఇంకా iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది. యాప్‌ను తెరిచిన తర్వాత మీ ఫోటోని దాని టెంప్లేట్‌లలో అప్‌లోడ్ చేయమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేయబడతారు. ఇప్పుడు మీకు కావలసిన టెంప్లేట్‌లు అండ్ మోడల్‌లను ఉపయోగించుకోవచ్చు.
Google Play Storeలో 100 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లు ఉన్న ఈ యాప్‌ను Linerock Investments Limited క్రియేట్ చేసారు. యాప్ ట్యాగ్‌లైన్"Photo Lab: The Easy Way to Make Your Photos Beautiful." PhotoLab ఒక సింపుల్ యాప్. ఈ యాప్ ఏఐ రంగంలో పెను ప్రకంపనలు సృష్టించింది. కానీ యాప్‌ను సక్సెస్ చేసింది టెక్నాలజీ కంటే ఎక్కువ సైకాలజీ. అయితే ఫోటోలాబ్ యాప్ వైరల్ అయిన మొదటి ఎడిటింగ్ యాప్ కాదు.
Remini, Lensa AI, Face App ఇంకా Prisma వంటి యాంటీవైరస్ యాప్స్ ఉన్నాయి. యాప్స్ వైరల్ అయినాక మొదట్లో సెన్సేషన్ చేసి ఆపై ట్రెండ్ డౌన్ అవుతాయి. వైరల్ ఫోటో యాప్స్ వెనుక ఉన్న సైన్స్ ఇదే.